Vinukonda: స్థానిక ఎన్నికలకు టీడీపీ శ్రేణులు సన్నద్ధం కావాలి!
Vinukonda: స్థానిక సంస్థల ఎన్నికలకు టీడీపీ శ్రేణులు సన్నద్ధం కావాలి.. వినుకొండ సమావేశంలో ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు పిలుపు.
Vinukonda: స్థానిక ఎన్నికలకు టీడీపీ శ్రేణులు సన్నద్ధం కావాలి!
Vinukonda: రాబోయే మున్సిపల్, స్థానిక సంస్థల ఎన్నికలకు టీడీపీ నాయకులు, కార్యకర్తలు సమష్టిగా సన్నద్ధం కావాలని ప్రభుత్వ చీఫ్ విప్, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు పిలుపునిచ్చారు. వినుకొండ పట్టణంలోని చీఫ్ విప్ కార్యాలయంలో నిర్వహించిన టీడీపీ క్యాడర్ సమావేశంలో ఆయన పాల్గొని పార్టీ శ్రేణులకు ఎన్నికల దిశానిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా జీవీ ఆంజనేయులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, నియోజకవర్గంలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన పెన్షన్ పథకంపై అర్హులకు అవగాహన కల్పించి, గ్రామాలు, పట్టణ వార్డుల్లో అర్హులైన ప్రతి ఒక్కరితో పెన్షన్ దరఖాస్తులు చేయించాలని కోరారు.
నియోజకవర్గంలోని అన్ని గ్రామాలతో పాటు వినుకొండ పట్టణంలోని ప్రతి వార్డులో ‘ఇంటింటికీ తెలుగుదేశం’ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసిన పార్టీ నాయకులు, కార్యకర్తలను జీవీ ఆంజనేయులు అభినందించారు.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని వార్డు, గ్రామ స్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయాలని సూచించారు. ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధించేలా ప్రతి ఒక్కరూ సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.సమావేశంలో డీసీసీబీ చైర్మన్ మక్కెన మల్లికార్జునరావుతో పాటు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




