రూ.1500 కోట్ల భూ కుంభకోణం: వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు అరెస్ట్‌పై ముస్తాక్ అహ్మద్ సంచలన వ్యాఖ్యలు!

రూ.1500 కోట్ల విలువైన ప్రభుత్వ భూమి కబ్జా కేసులో వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు అరెస్ట్. టీడీపీ మైనారిటీ రాష్ట్ర అధ్యక్షులు ముస్తాక్ అహ్మద్ ప్రెస్ మీట్. జగన్ ఫోన్ చేయడంపై మండిపాటు.

KAREEMULLA, VINUKONDA
Published on: 8 Jun 2026 7:49 PM IST
రూ.1500 కోట్ల భూ కుంభకోణం: వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు అరెస్ట్‌పై ముస్తాక్ అహ్మద్ సంచలన వ్యాఖ్యలు!
X

రూ.1500 కోట్ల భూ కుంభకోణం: వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు అరెస్ట్‌పై ముస్తాక్ అహ్మద్ సంచలన వ్యాఖ్యలు!

అమరావతి: పదవి లేనప్పుడే వందల ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నించిన మాజీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు ఎమ్మెల్యేగా పనిచేసిన కాలంలో ఎంత భారీ ఎత్తున భూ కుంభకోణాలు చేశారో వెలుగు తీయాలని టీడీపీ మైనారిటీ రాష్ట్ర అధ్యక్షులు, మైనార్టీ కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ ముస్తాక్ అహ్మద్ కోరారు. సోమవారం ప్రభుత్వ చీఫ్ విప్ కార్యాలయం లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ,కేవలం 35 కోట్ల రూపాయలకే 1500 కోట్ల విలువైన భూమిని బదిలీ చేసుకునేలా ఒప్పందాలు కుదుర్చుకున్నారని, అయితే ఫోర్జరీ పత్రాలు సృష్టించే క్రమంలో ఈ వ్యవహారం బయటపడిందని తెలిపారు. తెలంగాణ పోలీస్ శాఖ, ఇతర ప్రభుత్వ వ్యవస్థలు అలర్ట్ అయి, ప్రాథమికంగా నిమ్మల కుటుంబ సభ్యులను, లాయర్ రాధాకృష్ణను అరెస్ట్ చేశాయని పేర్కొన్నారు.చివరకు చెన్నైలో తెలంగాణ పోలీసులు అతనిని అరెస్ట్ చేశారని, ఈ భూ కబ్జా ఉదంతం మొత్తం తెలంగాణ పరిధిలోనే జరిగిందని స్పష్టం చేశారు. ఈ అరెస్టులను వైఎస్సార్‌సీపీ నాయకులు రాజకీయ కుట్రగా చిత్రీకరించడాన్ని టీడీపీ తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు.

బొల్లా బ్రహ్మనాయుడు గతంలో వినుకొండ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో కూడా అనేక అరాచకాలకు, కబ్జాలకు పాల్పడ్డారని టీడీపీ నాయకులు ఆరోపించారు.తప్పు చేసిన దొంగకు వైఎస్సార్‌సీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఫోన్ చేసి అండగా ఉంటామని చెప్పడం సిగ్గుచేటని, ఇది సమాజానికి ఎలాంటి సందేశం ఇస్తుందని మండిపడ్డారు. బొల్లా బ్రహ్మనాయుడు గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో చేసిన అన్ని భూ కబ్జాలు, అరాచకాలపై సమగ్ర విచారణ జరిపించి, వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు.

KAREEMULLA, VINUKONDA

KAREEMULLA, VINUKONDA

Next Story