Vinukonda: ఎమ్మెల్యే జీవీ కోసం శ్రీశైలానికి కాలినడకన టీడీపీ శ్రేణులు
Vinukonda: వినుకొండలో జీవీ ఆంజనేయులు గెలవాలని మొక్కుకున్న టీడీపీ నేతలు, తలార్లపల్లి నుంచి శ్రీశైలం వరకు పాదయాత్ర ప్రారంభించారు.
Vinukonda: ఎమ్మెల్యే జీవీ కోసం శ్రీశైలానికి కాలినడకన టీడీపీ శ్రేణులు
Vinukonda: వినుకొండ నియోజకవర్గం నూజండ్ల మండలంలోని తలార్లపల్లి గ్రామంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు ప్రత్యేక పాదయాత్రను ప్రారంభించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావాలని, నారా.చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాలని, అలాగే వినుకొండ ఎమ్మెల్యేగా G. V. ఆంజనేయులు భారీ మెజార్టీతో విజయం సాధించాలని ఎన్నికల సమయంలో చేసిన మొక్కుబడులు నెరవేరడంతో కృతజ్ఞతగా ఈ యాత్ర చేపట్టారు.
తలార్లపల్లి సోమేశ్వర ఆలయం నుంచి శ్రీశైలం మల్లికార్జున స్వామి దేవస్థానం వరకు సాగే ఈ పాదయాత్రను రాష్ట్ర విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ మోతడక వీరాచారి, కొలకలూరు నవకోటి మీసాల గోపి ప్రారంభించారు. వినుకొండ వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్ మీసాల మురళి యాదవ్ జెండా ఊపి యాత్రకు శ్రీకారం చుట్టారు. ఎన్నికల హామీల అమలుతో కూటమి ప్రభుత్వం ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకుంటోందని ఆయన పేర్కొన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ కూటమి ఘన విజయం సాధించాలని పిలుపునిచ్చారు.




