Vinukonda: వినుకొండ టీడీపీ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా చెరుకుంపాలెం షమీంఖాన్!

Vinukonda: పల్నాడు జిల్లా వినుకొండ మున్సిపల్ చైర్మన్ టీడీపీ అభ్యర్థిగా చెరుకుంపాలెం షమీంఖాన్ పేరును ఖరారు చేశారు. ప్రధాన పార్టీలు ఇద్దరూ మైనారిటీలకే చైర్మన్ సీటు కేటాయించడం విశేషం.

KAREEMULLA, VINUKONDA
Published on: 18 Oct 2026 8:09 AM IST
Vinukonda
X

Vinukonda: వినుకొండ టీడీపీ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా చెరుకుంపాలెం షమీంఖాన్!

Vinukonda: వినుకొండ పురపాలక సంఘం మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి ఎంపికపై కొనసాగుతున్న ఉత్కంఠకు తెరపడింది. తెలుగుదేశం పార్టీ మునిసిపల్ చైర్మన్ అభ్యర్థిగా చెరుకుంపాలెం షమీంఖాన్ పేరును ఖరారు చేస్తూ పార్టీ ప్రకటన విడుదల చేసింది. దీంతో గత కొద్ది రోజులుగా అభ్యర్థి ఎవరనే అంశంపై కొనసాగుతున్న చర్చలకు ముగింపు లభించింది.

మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి వినుకొండ టీడీపీ చైర్మన్ అభ్యర్థి ఎంపికపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. పార్టీ తరఫున ఎవరికి అవకాశం కల్పిస్తారనే అంశంపై నాయకులు, కార్యకర్తలు, ఆశావహుల్లో ఉత్కంఠ కొనసాగింది. చివరకు అధిష్ఠానం చెరుకుంపాలెం షమీంఖాన్ పేరును ఖరారు చేయడంతో ఈ ఉత్కంఠకు తెరపడినట్లయింది.పార్టీ అభ్యర్థిగా షమీంఖాన్ పేరు ప్రకటించడంతో ఆయన అభిమానులు, మద్దతుదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పటికే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున పి.ఎస్. ఖాన్‌ను చైర్మన్ అభ్యర్థిగా ప్రకటించగా, తాజాగా టీడీపీ కూడా మైనారిటీ వర్గానికి చెందిన షమీంఖాన్‌కు అవకాశం కల్పించడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. దీంతో వినుకొండ మున్సిపల్ ఎన్నికల్లో ప్రధాన పార్టీల అభ్యర్థులుగా మైనారిటీ వర్గానికి చెందిన నాయకులు బరిలో నిలవడం చర్చనీయాంశంగా మారింది.ఇటు వైసిపి, టిడిపి చైర్మన్ అభ్యర్థులను మైనారిటీలకు ఇవ్వటం ప్రాధాన్యత సంతరించుకుంది. పుర పోరు ఎలా ఉండనుందో ఎన్నికల ఫలితాల అనంతరం తేలనుంది.

KAREEMULLA, VINUKONDA

KAREEMULLA, VINUKONDA