Palnadu: పెదకూరపాడులో టీచర్‌పై కొబ్బరి మట్టలతో దాడి!
Palnadu: పల్నాడు జిల్లా పెదకూరపాడులో జెడ్పీ పాఠశాల ఉపాధ్యాయుడిపై కొందరు యువకులు కొబ్బరి మట్టలతో దాడికి పాల్పడటం కలకలం రేపింది. పోలీసులు కేసు నమోదు చేశారు.
Palnadu: పెదకూరపాడులో టీచర్‌పై కొబ్బరి మట్టలతో దాడి!
Palnadu: పెదకూరపాడు జిల్లా పరిషత్ పాఠశాలలో గణిత ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న జంపని నరేష్‌బాబు సహచర సిబ్బందితో కలిసి కారులో పాఠశాలకు వెళ్తుండగా సిరిపురం వద్ద మరో కారుతో స్వల్పంగా ఢీకొన్నట్లు సమాచారం.
ఈ విషయమై కారు యజమాని షేక్ సుభాని, అతని స్నేహితులు ఉపాధ్యాయుడి కారును వెంబడించి పాఠశాల సమీపంలో అడ్డుకున్నారు. అనంతరం నరేష్‌బాబును కిందకు లాగి చేతులతో, కొబ్బరి మట్టలతో దాడి చేసినట్లు తెలుస్తోంది. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Next Story




