Bapatla: ఉపాధ్యాయుల త్యాగాలు మరువలేనివి: ఎమ్మెల్యే మాలకొండయ్య!

Bapatla: బాపట్ల సాయి గార్డెన్స్‌లో నిర్వహించిన గురుపూజోత్సవంలో కలెక్టర్ వినోద్ కుమార్, ఎమ్మెల్యేలు మద్దులూరి మాలకొండయ్య, నరేంద్ర వర్మ రాజు పాల్గొన్నారు.

KaleshaVali (Bhasha), Chirala
Published on: 5 Sept 2026 8:03 PM IST
Bapatla
X

Bapatla: ఉపాధ్యాయుల త్యాగాలు మరువలేనివి: ఎమ్మెల్యే మాలకొండయ్య!

బాపట్ల: భారతదేశ మొదటి ఉపరాష్ట్రపతి, ప్రఖ్యాత తత్వవేత్త డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఆశయాలను ఉపాధ్యాయులు ప్రతి ఒక్కరూ ముందుకు తీసుకెళ్లాలని చీరాల శాసనసభ్యులు మద్దులూరి మాలకొండయ్య పిలుపునిచ్చారు.

సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జయంతిని పురస్కరించుకుని బాపట్ల పట్టణంలోని సాయి గార్డెన్స్ కన్వెన్షన్ హాల్‌లో గురు పూజోత్సవం (ఉపాధ్యాయ దినోత్సవం) వేడుకలో ముఖ్య అతిథులుగా బాపట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ వాసుదేవ వినోద్ కుమార్ గారు , బాపట్ల ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ రాజు మరియు చీరాల ఎమ్మెల్యే ఎం.ఎం. కొండయ్య పాల్గొని విద్యారంగంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన పలువురు ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించారు.

ఈ సందర్భంగా చీరాల శాసనసభ్యులు మద్దులూరి మాలకొండయ్య మాట్లాడుతూ... ఉపాధ్యాయుడిగా తన జీవితాన్ని ప్రారంభించి, దేశ అత్యున్నత పదవి అయిన రాష్ట్రపతి స్థాయికి ఎదిగిన మహనీయులు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్" అని కొనియాడారు. ఆయన పుట్టినరోజును ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవడం మనందరికీ గర్వకారణమన్నారు. సమాజంలో విద్యార్థులను భావి పౌరులుగా తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయులదే ప్రధాన పాత్ర అని, ఒక మంచి సమాజ నిర్మాణానికి పునాది గురువులేనని కొనియాడారు.

కేవలం పాఠ్యపుస్తకాల బోధనే కాకుండా, విద్యార్థులలో నైతిక విలువలు, దేశభక్తి, సేవా భావాన్ని పెంపొందించే బాధ్యత గురువులపైనే ఉందని పేర్కొన్నారు. కేవలం మార్కులు, డిగ్రీలే కాకుండా విద్యార్థులలో మానవతా విలువలు, దేశభక్తి, బాధ్యతాయుత భావాలను నూరిపోసే మహోన్నత బాధ్యత గురువులదేనని మద్దులూరి మాలకొండయ్య పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ అధికారులు, వివిధ ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు, పెద్ద సంఖ్యలో గురువులు పాల్గొన్నారు.

KaleshaVali (Bhasha), Chirala

KaleshaVali (Bhasha), Chirala

Next Story