Macherla: మాచర్ల రూరల్ పీఎస్ వద్ద ఉద్రిక్తత.. బంధువుల ధర్నా
Macherla: రాయవరం గ్రామానికి చెందిన వివాహిత బత్తుల హరిత అనుమానాస్పద మృతిపై భర్తే హత్య చేశాడని ఆరోపిస్తూ మాచర్ల రూరల్ పోలీస్ స్టేషన్ ఎదుట కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు.
Macherla: మాచర్ల రూరల్ పీఎస్ వద్ద ఉద్రిక్తత.. బంధువుల ధర్నా
మాచర్ల: మాచర్ల మండలం రాయవరం గ్రామానికి చెందిన బత్తుల హరిత (22) నిన్న సాయంత్రం అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది.ఈ ఘటనపై మృతురాలి తల్లిదండ్రులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తూ పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు.
తమ కుమార్తె హరితను ఆమె భర్త చంద్రశేఖర్ హత్య చేసి, ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నించాడని మృతురాలి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.తమ కుమార్తె మృతిపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
ఈ క్రమంలో తమకు న్యాయం జరగడం లేదని, కుమార్తె మృతికి సంబంధించి అల్లుడు చంద్రశేఖర్‌పై పోలీసులు తగిన చర్యలు తీసుకోవడం లేదని ఆరోపిస్తూ మాచర్ల రూరల్ పోలీస్ స్టేషన్ వద్ద నిరసన తెలిపారు,మృతురాలి తల్లిదండ్రులు చేసిన ఆరోపణలపై పోలీసుల అధికారిక స్పందన,దర్యాప్తు వివరాలు తెలియాల్సి ఉంది.




