Addanki: వినాయక నిమజ్జన ఊరేగింపులో పోలీసులతో హిజ్రాల వాగ్వాదం!

Addanki: ప్రకాశం జిల్లా అద్దంకి మండలం తిమ్మాయపాలెంలో వినాయక నిమజ్జన ఊరేగింపు సమయంలో పోలీసులు, హిజ్రాల మధ్య వాగ్వాదం. కొద్దిసేపు నెలకొన్న గందరగోళం.

Kolla Singaiah, Addanki
Published on: 26 Sept 2026 1:15 PM IST
Addanki
X

Addanki: వినాయక నిమజ్జన ఊరేగింపులో పోలీసులతో హిజ్రాల వాగ్వాదం!

Addanki: ప్రకాశం జిల్లా అద్దంకి మండలం తిమ్మాయపాలెం గ్రామంలో వినాయక నిమజ్జన ఊరేగింపు సందర్భంగా పోలీసులకు, హిజ్రాలకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. గ్రామంలో ఏర్పాటు చేసిన టీడీపీ వినాయక విగ్రహ నిమజ్జన ఊరేగింపులో హిజ్రాలు నృత్యాలు చేసేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు.

దీంతో పోలీసుల చర్యలకు హిజ్రాలు ప్రతిఘటించడంతో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు వారిని వారిస్తూ ఊరేగింపు జరుగుతున్న ప్రాంతం నుంచి బయటకు తరలించారు. ఘటనతో అక్కడ కొద్దిసేపు గందరగోళ పరిస్థితి ఏర్పడింది. పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు.

Kolla Singaiah, Addanki

Kolla Singaiah, Addanki