Prathipadu: ప్రత్తిపాడులో వినాయక చవితి వేళ మొదలైన రచ్చ!
Prathipadu: గుంటూరు జిల్లా ప్రత్తిపాడులో వినాయక చవితి వేడుకల వేళ పోలీసు నిబంధనల ఉల్లంఘనపై రచ్చ మొదలైంది. డీజేలు, రాజకీయ జెండాలపై ప్రజల నిరసన.
Prathipadu: ప్రత్తిపాడులో వినాయక చవితి వేళ మొదలైన రచ్చ!
Prathipadu: ప్రత్తిపాడు మండల కేంద్రంలో వినాయక చవితి పండగ సందర్భంగా పండగ ప్రారంభం కాకముందే రచ్చ మొదలైంది. ఓ పక్క అధికార పార్టీ ర్యాలీతో వినాయక విగ్రహాలను తీసుకెళ్తుంటే మరొక పక్కా పార్టీ డైలాగులతో ర్యాలీతో విగ్రహాలను తీసుకెళ్తుంది. ఇది ఇలా ఉంటే పోలీస్ సిబ్బంది పార్టీ జెండాలకు డీజీలకు పర్మిషన్ లేదంటూ మీడియా సమావేశం ఏర్పాటు చేసి చెప్పారు.
కానీ దీనికి విరుద్ధంగా ప్రత్తిపాడు మండల కేంద్రంలో జరుగుతుంది. ఒక పార్టీకి అనుమతిస్తే మిగతా పార్టీలకు కూడా అనుమతి ఇవ్వాల్సిందే. అంటూ ప్రజలు పోలీస్ శాఖపై బహిరంగ విమర్శిస్తున్నారు.
పండగ ప్రారంభం కాకముందే ఈ ర్యాలీలు ఏంటి? ఈ డీజేలు ఏంటి? ఎప్పుడు లేని విధంగా ఈ సంవత్సరం పండగ ప్రారంభం కాకుండానే రచ్చ మొదలైంది ఇప్పుడు పోలీస్ శాఖ ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సిందే?.




