Guntur: ఉపాధ్యాయుల్లో టెట్ కలవరం.. అర్హత మార్కులు 40 కి తగ్గించాలి!
Guntur: సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులకు టెట్ పరీక్ష కలవరం కలిగిస్తోంది. అర్హత మార్కులను 40 లేదా 45కి కుదించాలని విద్యాశాఖ మంత్రి లోకేష్‌ను కోరిన ముప్పాళ్ల.
Guntur: ఉపాధ్యాయుల్లో టెట్ కలవరం.. అర్హత మార్కులు 40 కి తగ్గించాలి!
Guntur: దీర్ఘకాలంగా ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగుతున్న వారికి టెట్ పరీక్ష, కరోనా లాంటి కలావరానికి గురి చేస్తుందని, అర్హత మార్కుల్ని 40/ 45 కు కుదించాలని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు. 150 మార్కులకి 60, 70,90 మార్కులు సాధించాలంటే చిన్న విషయం కాదని, బోధించే పాఠ్యాంశంతో పాటు పలు సబ్జెక్టుల్లో కలిపి ఇచ్చే ప్రశ్నాపత్రం ఈ వయసులో ఉపాధ్యాయులకు విషమ పరీక్ష లాంటిది అన్నారు.
దేశవ్యాప్తంగా 25 లక్షల మంది ఈ పరీక్షల్ని ఎదుర్కోవాల్సి ఉందని, మన రాష్ట్రంలో 80 వేల మంది ఈ పరీక్షలు రాసి అర్హత పొందితేనే ఉపాధ్యాయులుగా కొనసాగగలరు. సుప్రీంకోర్టు ఒకానొక తీర్పు నేపథ్యంలో విషయంలో NCTE ఈ పరీక్షలు రాష్ట్ర ప్రభుత్వం కలిసి నిర్వహించనున్నది.
STU మరియు పలు ఉపాధ్యాయ సంఘాలు అర్హత మార్కులను 40 గా నిర్ణయించమని కోరినప్పటికీని రాష్ట్ర విద్యాశాఖ అందుకు సుమూకత చూపకపోవడం విచారకరమన్నారు.
పార్లమెంటులో సుప్రీంకోర్టు తీర్పుని సవరిస్తూ చట్టం చేయించడం లేదా రాష్ట్రంలో ముఖ్యమంత్రి చొరవ తీసుకొని 40 లేక 45 మార్కులతో అర్హత సాధించునట్లు పరీక్షలను సులభతరం చేయాలని ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు.
పంజాబ్, మేఘాలయ రాష్ట్రాలు అనుసరించిన పద్ధతులని అధ్యయనం చేసి రాష్ట్ర విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ తగు వెసులుబాటు కల్పించి ఉపాధ్యాయుల సేవలను మెరుగైన పద్ధతుల్లో వినియోగించుకోవాలని ముప్పాళ్ళ కోరారు.




