Vinukonda: కన్నతండ్రిని పొట్టన పెట్టుకున్న కసాయి కొడుకు.. వినుకొండలో దారుణం!
Vinukonda: వినుకొండ నియోజకవర్గం వెల్లటూరు గ్రామంలో దారుణ ఘటన చోటుచేసుకుంది.
Vinukonda: కన్నతండ్రిని పొట్టన పెట్టుకున్న కసాయి కొడుకు.. వినుకొండలో దారుణం!
Vinukonda: వినుకొండ నియోజకవర్గం బొల్లాపల్లి మండలం వెల్లటూరు గ్రామంలో కుటుంబ కలహాలు విషాదానికి దారితీశాయి. డబ్బుల విషయంలో జరిగిన వివాదం ఓ వృద్ధుడి ప్రాణాలను బలిగొంది. పోలీసుల వివరాల ప్రకారం, గ్రామానికి చెందిన బాదరయ్య తన తండ్రి చిన నరసయ్యను డబ్బులు ఇవ్వాలని కోరాడు.
తండ్రి డబ్బులు ఇవ్వడానికి నిరాకరించడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. వివాదం తీవ్ర స్థాయికి చేరుకోవడంతో ఆగ్రహానికి గురైన బాదరయ్య కర్రతో తండ్రిపై దాడి చేశాడు.
ఈ ఘటనలో తీవ్ర గాయాలు పొందిన చిన నరసయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. గ్రామంలో ఈ ఘటన తీవ్ర కలకలం రేపగా, స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న రూరల్ సీఐ బ్రహ్మయ్య, ఎస్ఐ షేక్ సమీర్ బాష సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.




