Guntur: మలినేని మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో ‘ట్రైల్బ్లేజర్స్ 2026’!
Guntur: పుల్లడిగుంట మలినేని లక్ష్మయ్య మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో బుధవారం ‘ట్రైల్బ్లేజర్స్ 2026’ పేరుతో 2వ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డే ఘనంగా జరిగింది.
Guntur: మలినేని మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో ‘ట్రైల్బ్లేజర్స్ 2026’!
గుంటూరు జిల్లా: గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం పుల్లడిగుంటలోని మలినేని లక్ష్మయ్య మహిళా ఇంజనీరింగ్ కళాశాల (స్వయంప్రతిపత్తి)లో బుధవారం ‘ట్రైల్బ్లేజర్స్ 2026’ పేరుతో 2వ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమం 18.11.2026 న ఘనంగా జరిగింది.
కళాశాల కళావేదికలో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు జరిగిన ఈ కార్యక్రమం, 2024–2026 పీజీ స్వయంప్రతిపత్తి బ్యాచ్ (ఎం.టెక్., ఎంబీఏ, ఎంసీఎ) విద్యాపరమైన ముగింపు వేడుక, కళాశాలకు చెందిన ఆటోనమస్ ఎగ్జామ్ సెక్షన్ ఆధ్వర్యంలో ఈ వేడుకను నిర్వహించారు.
ముఖ్య అతిథిగా గుంటూరు నగరపాలక సంస్థ (GMC) 43వ వార్డు కార్పొరేటర్ శ్రీమతి రంగవజ్జుల గాయత్రి గారు హాజరయ్యారు. కళాశాల చైర్మన్ డాక్టర్ మలినేని పెరుమాళ్లు గారు, ప్రిన్సిపాల్ డాక్టర్ జె. అప్పారావు గారు, డైరెక్టర్ డాక్టర్ కె. వెంకటేశ్వరావు గారు వేదికపై ఆసీనులై సభనుద్దేశించి ప్రసంగించారు.
స్వాగత నృత్యంతో ప్రారంభమైన కార్యక్రమంలో అతిథులు జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం ప్రార్థనా గీతాలాపన జరిగింది.
చైర్మన్ డాక్టర్ మలినేని పెరుమాళ్లు గారు మాట్లాడుతూ, మహిళా సాధికారతే ఈ కళాశాల లక్ష్యమని, చక్కటి విద్య, సరైన అవకాశం లభిస్తే మహిళలు ఏ రంగంలోనైనా నాయకత్వం వహించగలరని అన్నారు. విద్యార్థినులు తమ విలువలనే మూలాలుగా చేసుకుని, జ్ఞానం, నైపుణ్యాలు, ఆత్మవిశ్వాసమనే రెక్కలతో ఎత్తుకు ఎదగాలని సూచించారు. నిరంతరం నేర్చుకుంటూ, నిజాయితీగా ఉంటూ, తోటి మహిళలను కూడా ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. పూర్వ విద్యార్థులుగా కళాశాలతో అనుబంధాన్ని కొనసాగించాలని కోరారు.
డైరెక్టర్ డాక్టర్ కె. వెంకటేశ్వరావు గారు మాట్లాడుతూ, పట్టభద్రులైన విద్యార్థినులను అభినందించారు. కొత్త సాంకేతికతలను నిరంతరం నేర్చుకుంటూ, క్రమశిక్షణతో, పట్టుదలతో తమ లక్ష్యాలను సాధించాలని సూచించారు. ఉద్యోగ, ఉన్నత విద్య, స్వయం ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకుని కళాశాలకు మంచి పేరు తేవాలని ఆకాంక్షించారు.
ముఖ్య అతిథి శ్రీమతి రంగవజ్జుల గాయత్రి గారు మాట్లాడుతూ, విద్యార్థినులను అభినందించి, విద్య ద్వారా మహిళలు సమాజంలో గొప్ప మార్పు తీసుకురాగలరని అన్నారు. ఆత్మవిశ్వాసంతో, కష్టపడి పనిచేసి లక్ష్యాలను సాధించాలని, తమకు అండగా నిలిచిన కుటుంబాలను, అధ్యాపకులను ఎప్పటికీ మరవకూడదని సూచించారు. సమాజ సేవలో భాగస్వాములు కావాలని కోరుతూ, మహిళా సాధికారత కోసం కృషి చేస్తున్న కళాశాల యాజమాన్యాన్ని ప్రశంసించారు.
కార్యక్రమంలో ఎం.టెక్., ఎంబీఏ, ఎంసీఎ కోర్సుల్లో మొదటి, రెండవ స్థానాల్లో నిలిచిన విద్యార్థినులకు బహుమతులు అందజేసి సత్కరించారు. అనంతరం 2024–2026 బ్యాచ్‌కు చెందిన 208 మంది (ఎం.టెక్. 31, ఎంబీఏ 63, ఎంసీఎ 114) విద్యార్థినులతో పాటు, 2023 బ్యాచ్‌కు చెందిన 40 మందికి, మొత్తం 248 మందికి ప్రొవిజనల్ సర్టిఫికెట్లు (PC), కన్సలిడేటెడ్ మార్క్స్ మెమోలు (CMM) అందజేశారు.
కార్యక్రమం అనంతరం పట్టభద్రులను కళాశాల పూర్వ విద్యార్థుల సంఘంలో (అలుమ్నీ) నమోదు చేసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్, డీన్లు, యూజీ–పీజీ విభాగాధిపతులు, ప్లేస్మెంట్ అధికారి (TPO), ఐక్యూఏసీ సమన్వయకర్త, పీజీ అధ్యాపకులు, విద్యార్థినుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.




