Chirala: చీరాలలో 11 కేజీల గంజాయి స్వాధీనం: ఇద్దరు నిందితుల అరెస్ట్!
Chirala: బాపట్ల జిల్లా చీరాల వన్‌టౌన్ పరిధిలో గంజాయి రవాణా చేస్తున్న తమిళనాడుకు చెందిన ఇద్దరిని అరెస్ట్ చేసి, 11 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు.
Chirala: చీరాలలో 11 కేజీల గంజాయి స్వాధీనం: ఇద్దరు నిందితుల అరెస్ట్!
Chirala: జిల్లా ఎస్పీ శ్రీ బి. ఉమామహేశ్వర్ ఐపీఎస్ ఆదేశాల మేరకు జిల్లాలో గంజాయి విక్రయాలు, వినియోగం, రవాణాపై జిల్లా పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. చీరాల 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయిని అక్రమంగా రవాణా చేస్తున్న తమిళనాడు రాష్ట్రానికి చెందిన ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి, వారి వద్ద ఉన్న 11 కేజీల గంజాయిని పోలీస్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం చీరాల 1 టౌన్ పోలీస్ స్టేషన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో చీరాల డీఎస్పీ ఎం.డి. మొయిన్ గారు కేసు వివరాలను వెల్లడించారు.
నిందితుల వివరాలు:
1. బాల శ్యాంప్రశాంత్, తండ్రి బాల, 19 సంవత్సరాలు, హౌసింగ్ బోర్డ్, పెరంబూర్, చెన్నై.
2. అరవిందన్ శంకర్, తండ్రి శంకర్, 18 సంవత్సరాలు, హౌసింగ్ బోర్డ్, ఎగ్మోర్, చెన్నై.
తమిళనాడు రాష్ట్రం, చెన్నై పట్టణానికి చెందిన బాల శ్యాంప్రశాంత్, అరవిందన్ శంకర్‌లు మరొక వ్యక్తితో కలిసి గ్రూపుగా ఏర్పడి, చెన్నై నుంచి పార్వతీపురం వెళ్లి అక్కడ గంజాయిని కొనుగోలు చేసి చెన్నైకి తరలించే క్రమంలో ధన్‌బాద్–అలెప్పి ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తున్నారు.
జిల్లా ఎస్పీ శ్రీ బి. ఉమామహేశ్వర్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు ఎస్‌బీ-2 ఇన్‌స్పెక్టర్ ఎం. రాంబాబు ఆధ్వర్యంలోని స్పెషల్ టీమ్స్ అదే రైలులో బాపట్ల–చీరాల మధ్య తనిఖీలు నిర్వహిస్తున్న విషయాన్ని గమనించి, తేదీ: 24.08.2026 రాత్రి చీరాల రైల్వే స్టేషన్‌లో దిగి అక్కడి నుంచి వెళ్లిపోయారు.
ఈ రోజు చీరాల 1 టౌన్ పోలీసులకు అందిన సమాచారం మేరకు గంజాయి కలిగి ఉన్న ఇద్దరు నిందితులను చీరాల పట్టణంలోని దండుబాట రోడ్డు టీ జంక్షన్ వద్ద చీరాల 1 టౌన్ ఎస్‌ఐ హరిబాబు గారు తన సిబ్బందితో కలిసి అదుపులోకి తీసుకున్నారు.
వారి వద్ద నుంచి 11 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయంపై చీరాల 1 టౌన్ సీఐ జి. సోమశేఖర్ గారు Cr.No.169/2026, U/s 8(c) r/w 20(b)(ii)(B) NDPS Act కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
బాపట్ల జిల్లాలో గంజాయి, ఇతర మత్తుపదార్థాల అక్రమ రవాణా, విక్రయాల నెట్‌వర్క్‌ను పూర్తిగా అణచివేసేందుకు జిల్లా ఎస్పీ శ్రీ బి. ఉమామహేశ్వర్ ఐపీఎస్ గారి ఆధ్వర్యంలో జిల్లా పోలీస్ శాఖ అత్యంత కఠినంగా వ్యవహరిస్తోందని చీరాల డీఎస్పీ ఎం.డి. మొయిన్ తెలిపారు.
యువత, విద్యార్థుల భవిష్యత్తును నిర్వీర్యం చేస్తున్న మత్తు సంస్కృతిపై ఉక్కుపాదం మోపుతున్నామన్నారు. ఇందులో భాగంగా పటిష్టమైన నిఘా వ్యవస్థను ఏర్పాటు చేసి, గతంలో నేరాలకు పాల్పడిన వారిపై నిఘా ఉంచామన్నారు.
ఎవరైనా గంజాయి వంటి మాదకద్రవ్యాలను కలిగి ఉన్నా, అక్రమ రవాణా, విక్రయాలకు పాల్పడుతున్నట్లు సమాచారం తెలిసినట్లయితే దగ్గరలోని పోలీస్ స్టేషన్‌కు లేదా టోల్ ఫ్రీ నంబర్ 112కు కాల్ చేసి సమాచారం అందించి పోలీస్ శాఖకు సహకరించాలన్నారు. సమాచారం అందించిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని తెలిపారు.
ఈ సమావేశంలో చీరాల డీఎస్పీ తో పాటు చీరాల 1 టౌన్ ఇన్‌స్పెక్టర్ జి. సోమశేఖర్ గారు, ఎస్‌బీ-2 ఇన్‌స్పెక్టర్ ఎం. రాంబాబు గారు, కేసు ఛేదించడంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు




