Karlapalem: కర్లపాలెం హైవేపై రెండు లారీలు ఢీ తప్పిన పెను ప్రమాదం!
Karlapalem: బాపట్ల-కర్లపాలెం హైవేలో రెండు లారీలు ఢీ.. క్యాబిన్‌లో ఇరుక్కుపోయిన డ్రైవర్‌ను సురక్షితంగా బయటకు తీసిన స్థానికులు, తప్పిన ప్రాణనష్టం.
Karlapalem: కర్లపాలెం హైవేపై రెండు లారీలు ఢీ తప్పిన పెను ప్రమాదం!
Karlapalem: బాపట్ల - కర్లపాలెం హైవేలో కర్లపాలెం దగ్గర శనివారం రెండు లారీలు ఢీకొన్న ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఒక లారీ డ్రైవర్ కాలు క్యాబిన్ లో ఇరుక్కుపోయింది.
వెంటనే అప్రమత్తమైన దగ్గర్లో ఉన్న కొందరు స్థానిక వ్యక్తులు హుటాహుటిన లారీ దగ్గరకు చేరుకుని, ఇరుక్కుపోయిన కాలును జాగ్రత్తగా తప్పించి డ్రైవర్ ను సురక్షితంగా బయటకు తీశారు
ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రాణాపాయం జరగలేదు. డ్రైవర్ క్షేమంగా బయటపడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.




