Chinnaganjam: ప్రతి ఇంటికీ అభివృద్ధి ఫలాలు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు!

Chinnaganjam: గత రెండేళ్లలో ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి ఫలాలు ప్రతి కుటుంబానికీ చేరాయని, ప్రజల విశ్వాసంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు అన్నారు.

KaleshaVali (Bhasha), Chirala
Published on: 7 Aug 2026 9:14 AM IST
Chinnaganjam
X

Chinnaganjam: ప్రతి ఇంటికీ అభివృద్ధి ఫలాలు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు!

Chinnaganjam: గత రెండేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల ఫలాలు ప్రతి కుటుంబానికీ చేరాయని, ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన '2 ఏళ్ల నమ్మకం - అభివృద్ధి, సంక్షేమం' కార్యక్రమంలో భాగంగా గురువారం చిన్నగంజాం మండల కేంద్రంలోని ఎస్టీ కాలనీలో నిర్వహించిన 'ఇంటింటికి తెలుగుదేశం' కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల వివరాలను ప్రతి ఇంటికీ చేరవేయడమే ఈ కార్యక్రమం ఉద్దేశమన్నారు. గత రెండేళ్లలో ప్రజలకు అందించిన ఆర్థిక సహాయం, వివిధ సంక్షేమ పథకాలు, గ్రామాల్లో చేపట్టిన మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులను ప్రజలకు వివరించి కరపత్రాలను పంపిణీ చేశారు.

ప్రభుత్వం ప్రజల అవసరాలకు అనుగుణంగా పాలన అందిస్తూ అభివృద్ధి, సంక్షేమాన్ని సమానంగా ముందుకు తీసుకెళ్తోందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ప్రభుత్వ పథకాలను ప్రతి అర్హ కుటుంబం సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో అబ్జర్వర్ షమీమ్ ఖాన్, మార్కెట్ కమిటీ చైర్మన్ గుంజి వెంకట్రావు,

క్లస్టర్ ఇన్‌చార్జీలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు.

KaleshaVali (Bhasha), Chirala

KaleshaVali (Bhasha), Chirala

Next Story