Bapatla: వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు 60వ జన్మదిన వేడుకలు ఘనం!

Bapatla: వేమూరు ఎమ్మెల్యే, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు నక్కా ఆనందబాబు 60వ జన్మదిన వేడుకలు గుంటూరు, వేమూరుల్లో ఘనంగా నిర్వహణ. భారీగా తరలివచ్చిన నాయకులు, శ్రేణులు.

KIRAN BABU,	VEMURU
Published on: 11 Sept 2026 11:41 AM IST
Bapatla
X

Bapatla: వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు 60వ జన్మదిన వేడుకలు ఘనం!

Bapatla: వేమూరు ఎమ్మెల్యే, మాజీ మంత్రి, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు నక్కా ఆనందబాబు 60వ జన్మదిన వేడుకలు గుంటూరు క్యాంపు కార్యాలయం, వేమూరు NTR పురవేదికలో ఘనంగా జరిగాయి. నాలుగు దశాబ్దాలుగా టీడీపీతో కొనసాగుతున్న నక్కా ఆనందబాబు కార్యకర్తగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించి మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా, రాష్ట్ర కేబినెట్ మంత్రిగా కీలక బాధ్యతలు నిర్వహించారు.

2024 ఎన్నికల్లో మూడోసారి వేమూరు ఎమ్మెల్యేగా 22,021 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. జన్మదిన వేడుకలకు భారీగా తరలివచ్చిన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు నక్కా ఆనందబాబుకు ఘనంగా శుభాకాంక్షలు తెలిపారు. వేమూరు ప్రజలు, కార్యకర్తలు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ నియోజకవర్గ అభివృద్ధికి మరింత బాధ్యతతో పనిచేస్తానని నక్కా ఆనందబాబు తెలిపారు.

KIRAN BABU,	VEMURU

KIRAN BABU, VEMURU