Vemuru: వేమూరులో రూ.28.50 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ: ఎమ్మెల్యే ఆనందబాబు
Vemuru: వేమూరులో 75 మంది లబ్ధిదారులకు రూ.28.50 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు పంపిణీ చేశారు.
Vemuru: వేమూరులో రూ.28.50 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ: ఎమ్మెల్యే ఆనందబాబు
బాపట్ల: వేమూరు నియోజకవర్గంలో 75 మంది లబ్ధిదారులకు రూ.28 లక్షల 50 వేల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు పంపిణీ చేశారు.
వేమూరు నియోజకవర్గంలో ఇప్పటివరకు సుమారు రూ.12 కోట్ల విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను లబ్ధిదారులకు అందించినట్లు ఎమ్మెల్యే తెలిపారు.
ఆర్థిక ఇబ్బందులతో వైద్యం చేయించుకోలేని పేదలకు ముందుగానే ఎల్ఓసీ ద్వారా వైద్యసాయం అందించి ప్రాణాపాయ పరిస్థితులను తగ్గించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.
వైద్యం చేయించుకున్న అనంతరం సీఎంఆర్ఎఫ్కు దరఖాస్తు చేసుకునే పేదలకు కూడా తన కార్యాలయం ద్వారా అవసరమైన సహకారం అందిస్తామని నక్కా ఆనందబాబు భరోసా ఇచ్చారు.
పెన్షన్లు అప్లై చేసుకునే వారికి ఇంకా రెండు రోజులు టైం మాత్రమే ఉంది కాబట్టి ఎవరైనా అప్లై చెయ్యకపోతే వెంటనే నమోదు చేసుకోవాలని కోరారు




