Vemuru: జంపని గ్రామంలో పింఛన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు!

Vemuru: వేమూరు మండలం జంపని గ్రామంలో వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు పింఛన్లు పంపిణీ చేశారు.

KIRAN BABU,	VEMURU
Published on: 1 Oct 2026 11:18 AM IST
Vemuru
X

Vemuru: జంపని గ్రామంలో పింఛన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు!

Vemuru: వేమూరు మండలం జంపని గ్రామంలో వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు పెన్షన్లను ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో తొలిసారిగా పెన్షన్ పథకాన్ని తీసుకొచ్చింది తెలుగుదేశం ప్రభుత్వమేనని, రూ.30 నుంచి పెన్షన్‌ను రూ.4 వేల వరకు పెంచింది కూడా టీడీపీ ప్రభుత్వమేనని అన్నారు.

తల్లికి వందనం పథకం ద్వారా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ప్రయోజనం అందుతుందని తెలిపారు. అన్నదాత సుఖీభవ ద్వారా రైతులకు అండగా నిలుస్తున్నామని, స్త్రీ శక్తి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఉచిత గ్యాస్ సిలిండర్లు అందిస్తున్నామని చెప్పారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో సంక్షేమంతో పాటు రాష్ట్రంలో అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తున్నామని ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు అన్నారు ప్రభుత్వానికి ప్రజలు అండగా నిలిచి, స్థానిక ఎన్నికల్లో విజయానికి సహకరించాలని కోరారు.

KIRAN BABU,	VEMURU

KIRAN BABU, VEMURU