Vetapalem: మిత్రుడి కుటుంబానికి 1992-93 బ్యాచ్ స్నేహితుల ఆర్థిక అండ!

Vetapalem: వేటపాలెంలో స్నేహ బంధం అనారోగ్యంతో మృతి చెందిన మిత్రుడు షేక్ జిలానీ కుటుంబానికి 1992-93 పదో తరగతి బ్యాచ్ మిత్రులు రూ.31 వేల ఆర్థిక సాయం అందజేత.

KaleshaVali (Bhasha), Chirala
Published on: 28 Sept 2026 11:28 PM IST
Vetapalem
X

Vetapalem: మిత్రుడి కుటుంబానికి 1992-93 బ్యాచ్ స్నేహితుల ఆర్థిక అండ!

వేటపాలెం: బండ్ల బాపయ్య హిందూ జూనియర్ కాలేజ్ 1992-93 పదో తరగతి బ్యాచ్‌కు చెందిన తమ మిత్రుడు షేక్ జిలానీ అనారోగ్యంతో మృతి చెందడం పట్ల బ్యాచ్ మిత్రులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వేటపాలెం మండలం వేటపాలెం గ్రామపంచాయతీ పరిధిలోని చిన్నబజారులో నివాసం ఉంటున్న షేక్ జిలానీ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందడంతో ఆయన కుటుంబం ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న నేపథ్యంలో మిత్రులంతా కలిసి కుటుంబానికి అండగా నిలిచారు.

జిలానీ కుటుంబానికి తోడుగా నిలిచేందుకు 1992-93 బ్యాచ్ మిత్రులంతా కలిసి రూ.31,000లను ఆయన కుటుంబ సభ్యులకు అందించారు. ముఖ్యంగా ఆయన పిల్లల విద్యావసరాలకు ఈ మొత్తాన్ని వినియోగించుకోవాలని సూచించారు.

అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలోనూ గత ఏడాది జిలానీ వైద్య ఖర్చుల నిమిత్తం బ్యాచ్ మిత్రులు రూ.25,000ల ఆర్థిక సహాయం అందించినట్లు తెలిపారు. అయితే ఆయనను కాపాడుకోలేకపోవడం తమను తీవ్రంగా కలచివేసిందని మిత్రులు ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో బ్యాచ్ మిత్రులు గాత్రం ఉమామహేశ్వరరావు, పృథ్వి శేషు, షేక్ షమీమ్ తదితరులు పాల్గొన్నారు. మిత్రుడి కుటుంబానికి అండగా నిలిచిన బ్యాచ్ సభ్యుల సేవాభావాన్ని పలువురు అభినందించారు.

KaleshaVali (Bhasha), Chirala

KaleshaVali (Bhasha), Chirala