Vetapalem: ఎంఈఓ కార్యాలయానికి పట్టభద్రుల సాయం.. ₹10 వేల చెక్కు అందజేత!
Vetapalem: వేటపాలెం మండల విద్యాశాఖ కార్యాలయానికి పట్టభద్రుల సంఘం ₹10,000 ఆర్థిక సాయం అందజేసింది.
Vetapalem: ఎంఈఓ కార్యాలయానికి పట్టభద్రుల సాయం.. ₹10 వేల చెక్కు అందజేత!
వేటపాలెం: వేటపాలెం మండల విద్యా శాఖ ప్రధాన కార్యాలయం నుండి నిర్వాణ కార్యక్రమంలో అవసరాలకు ప్రింటర్ స్కానరు నిమిత్తం పట్టభద్రుల సంఘం ఆధ్వర్యంలో మండల విద్యాశాఖ అధికారి శ్రీ కౌతవరపు శ్రీనివాసరావు కి ₹10,000 రూపాయలు చెక్కును అధ్యక్షులు సుబ్బారావు చేతుల మీదుగా అందజేయడం జరిగింది. సంఘ ప్రధాన కార్యదర్శి ఎస్వీఎల్ ప్రసాద్, కోశాధికారి సజ్జా శ్రీధర్, ఉపాధ్యక్షులు బుర్ర సాంబశివరావు, సభ్యులు నాగరాజు, కంప్యూటర్ ఆపరేటర్ సోమయ్య, రంగనాథ్ గుప్తా తదితరులు పాల్గొన్నారు.
మండల విద్యా శాఖ శ్రీనివాసరావు మాట్లాడుతూ వేటపాలెం విద్యాశాఖకు విచ్చేసిన కొద్ది కాలంలోనే పట్టభద్రుల సంఘం యొక్క సేవా కార్యక్రమాలను, విద్యాభివృద్ధి నిమిత్తం చేస్తున్నటువంటి కృషి తెలుసుకొని ,మేము మండల విద్యా కార్యాలయమునకు సహకారం కోరాం. ఈ ప్రాంతంలో ఏ పాఠశాలలో చూసిన సంఘం యొక్క సహాయ సహకారాలతోటి విద్యాఅభివృద్ధికి కృషి చేయటము చాలా సంతోషం అని అన్నారు.




