Vetapalem: అమరావతి ఛాంపియన్‌షిప్‌కు వేటపాలెం ఎంజేపీ విద్యార్థుల ఎంపిక!

Vetapalem: చీరాల నియోజకవర్గ స్థాయి అమరావతి ఛాంపియన్‌షిప్ పోటీల్లో వేటపాలెం ఎంజేపీ బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాల విద్యార్థులు ప్రతిభ కనబరిచారు.

KaleshaVali (Bhasha), Chirala
Published on: 31 July 2026 10:44 AM IST
Vetapalem
X

Vetapalem: అమరావతి ఛాంపియన్‌షిప్‌కు వేటపాలెం ఎంజేపీ విద్యార్థుల ఎంపిక!

Vetapalem: చీరాల నియోజకవర్గ స్థాయి అమరావతి ఛాంపియన్‌షిప్ ఎంపిక పోటీల్లో MJP ఆంధ్రప్రదేశ్ బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాల, వేటపాలెం విద్యార్థులు విశేష ప్రతిభ కనబర్చి జిల్లా స్థాయి అమరావతి ఛాంపియన్‌షిప్ పోటీలకు ఎంపికయ్యారు.

వాలీబాల్ విభాగంలో ఎ. రాకేష్, కె. వినయ్ కుమార్, జి. గృహత్ ఎంపికయ్యారు.

కబడ్డీ విభాగంలో బి. శ్రీను, టీ. తనుష్ జిల్లాస్థాయి పోటీలకు అర్హత సాధించారు.

అథ్లెటిక్స్ విభాగంలో జశ్వంత్ జావెలిన్ త్రోలో ప్రథమ స్థానం, షాట్‌పుట్‌లో ద్వితీయ స్థానం సాధించి జిల్లాస్థాయి పోటీలకు ఎంపికయ్యాడు.

ఖోఖో విభాగంలో కె. శివశంకర్, టీ. చందు, వి. మనోజ్ రామ్, బి. శ్రీనివాస్, ఎ. మణికంఠ, ఎల్. వెంకటరాజేష్ జిల్లాస్థాయి పోటీలకు ఎంపికయ్యారు.

ఈ సందర్భంగా ఎంపికైన విద్యార్థులను పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీమతి నహీదా గారు, ఉపాధ్యాయులు మరియు శారీరక విద్యా ఉపాధ్యాయులు అభినందించారు. జిల్లాస్థాయి పోటీల్లోనూ అత్యుత్తమ ప్రతిభ కనబర్చి పాఠశాలకు, చీరాల నియోజకవర్గానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.

KaleshaVali (Bhasha), Chirala

KaleshaVali (Bhasha), Chirala

Next Story