Macherla: 'హర్ ఘర్ తిరంగా': 1600 అడుగుల భారీ జాతీయ జెండాతో ర్యాలీ!
Macherla: 80వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మాచర్ల విజయపురి సౌత్‌లో 1600 అడుగుల భారీ జాతీయ జెండాతో హర్ ఘర్ తిరంగా ర్యాలీ.
Macherla: 'హర్ ఘర్ తిరంగా': 1600 అడుగుల భారీ జాతీయ జెండాతో ర్యాలీ!
Macherla: విజయపురిసౌత్ (సాగర్) లో హర్ ఘర్ తిరంగా ర్యాలీ ..భారీ జాతీయ జెండాతో ర్యాలీ చేసిన అధికారులు, విద్యార్థులు భారతదేశ 80వ స్వాతంత్య్రదినోత్సవ వేడుకలను పురస్కరించుకుని హర్ ఘర్ తిరంగా అభియాన్ లో భాగంగా మాచర్ల మండలం విజయపురిసౌత్ లోని గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఈ కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్బంగా విజయపురిసౌత్ లోని గ్రామ పురవీధుల్లో తిరుగుతూ 1600 అడుగుల భారీ జాతీయ జెండా చేతబట్టుకొని తిరుగుతూ భారత్ మాతాకీ జై అంటూ నినాదాలు చేశారు.దేశభక్తి తో కూడిన సాంస్కృతిక కార్యక్రమాలను విద్యార్థులు ప్రదర్శించారు.తరువాత మానవహారం గాఏర్పడ్డారు. అధికారులు మాట్లాడుతూ దేశ స్వాతంత్య్రం కోసం ఎందరో ప్రాణాలర్పించిన మహనీయుల త్యాగాలు చిరస్మరణీయమనిన్నారు.
ప్రతి ఒక్కరూ హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగస్వాములు కావాలని, ప్రతి ఇంటిపై జాతీయ జెండాఎగురవేయాలన్నారుఈ కార్యక్రమం లో పాఠశాల ప్రిన్సిపాల్,ఉపాధ్యాయలు,పోలీసులు,అధికారులు విద్యార్థులు స్థానికులు భారీగా పాల్గొన్నారు.




