Vijayawada: మేయర్ వంగవీటి రాధాకు ఎమ్మెల్యే గళ్ళా మాధవి అభినందనలు!
Vijayawada: విజయవాడ నగర మేయర్‌గా ఎన్నికైన వంగవీటి రాధాకృష్ణను గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గళ్ళా మాధవి మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను అందించి, శాలువాతో సత్కరించారు.
Vijayawada: మేయర్ వంగవీటి రాధాకు ఎమ్మెల్యే గళ్ళా మాధవి అభినందనలు!
విజయవాడ: విజయవాడ నగర పాలక సంస్థ (VMC) నూతన మేయర్‌గా ఎన్నికైన వంగవీటి రాధాకృష్ణ ని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యురాలు, తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యురాలు గళ్ళా మాధవి , గళ్ళా రామచంద్రరావు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు మొక్కను అందించి, శాలువాతో సత్కరించి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గళ్ళా మాధవి మాట్లాడుతూ... ప్రజా సమస్యలపై నిరంతరం గళమెత్తే నాయకుడు వంగవీటి రాధాకృష్ణ మేయర్‌గా ఎన్నికవ్వటం హర్షణీయమని, ఆయన సమర్థవంతమైన నాయకత్వంలో విజయవాడ నగరంలో మౌలిక వసతుల కల్పన, పారిశుద్ధ్యం, తాగునీరు వంటి కీలక రంగాల్లో విశేష పురోగతి సాధించాలని, విజయవాడను ఒక ఆదర్శ నగరంగా తీర్చిదిద్దాలని ఎమ్మెల్యే గళ్ళా మాధవి ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పలువురు కార్పొరేటర్లు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.




