Vinjanampadu: కిట్స్ కళాశాలలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు
Vinjanampadu: వింజనంపాడు కిట్స్ (KITS) ఇంజనీరింగ్ కళాశాలలో ముందస్తు కృష్ణాష్టమి సంబరాలు అత్యంత ఉత్సాహభరితంగా జరిగాయి.
Vinjanampadu: కిట్స్ కళాశాలలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు
వింజనంపాడు: కె.కె.ఆర్. అండ్ కె.ఎస్.ఆర్. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (కిట్స్ కళాశాల)లో శ్రీ కృష్ణాష్టమి వేడుకలను పురస్కరించుకుని గురువారం ముందస్తు సంబరాలు అత్యంత ఉత్సాహభరిత వాతావరణంలో నిర్వహించారు.
ఈ కార్యక్రమం సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఎంతగానో ఆకట్టుకున్నాయి. శ్రీకృష్ణుని బాల్య లీలలను గుర్తుచేసేలా విద్యార్థులు వేషధారణలు ధరించి చేసిన నృత్యాలు మరియు ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు, సంప్రదాయ ఉట్టి కొట్టడం కార్యక్రమాన్ని కూడా అత్యంత ఉత్సాహంగా నిర్వహించారు. విద్యార్థులు కేరింతలు కొడుతూ ఉట్టి కొట్టే పోటీల్లో ఉత్సాహంగా పాల్గొని సందడి చేశారు.
ఈ వేడుకల్లో కళాశాల చైర్మన్ డాక్టర్ కోయ సుబ్బారావు గారు, కార్యదర్శి శ్రీ కోయ శేఖర్ గారు ముఖ్య అతిథులుగా విచ్చేసి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. విద్యార్థులు చదువుతో పాటు ఇలాంటి సాంస్కృతిక, ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా మన సంస్కృతిని కాపాడుకోవచ్చని, మానసిక ఉల్లాసం లభిస్తుందని వారు తెలిపారు.
ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పి. బాబు గారు, అకాడమిక్ డైరెక్టర్ డాక్టర్ కె. హరిబాబు గారు వివిధ విభాగాధిపతిలు పాల్గొని విద్యార్థులకు శ్రీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో విద్యార్థినీ విద్యార్థులు, వివిధ విభాగాల అధ్యాపకులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.




