Palnadu: వినుకొండలో టీడీపీకి షాక్.. వైసీపీలో చేరిన 15 కుటుంబాలు!
Palnadu: వినుకొండ నియోజకవర్గం బొల్లాపల్లి మండలం సీతారామపురం తండాకు చెందిన 15 టీడీపీ కుటుంబాలు మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరాయి
Palnadu: వినుకొండలో టీడీపీకి షాక్.. వైసీపీలో చేరిన 15 కుటుంబాలు!
Palnadu: వినుకొండ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి చెందిన 15 కుటుంబాలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరాయి. బొల్లాపల్లి మండలం సీతారామపురం తండాకు చెందిన ఈ కుటుంబాలు వినుకొండ మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ (పీఏసీ) సభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నాయి.
ఈ సందర్భంగా బొల్లా బ్రహ్మనాయుడు వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా బొల్లా బ్రహ్మనాయుడు మాట్లాడుతూ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యున్నతికి కష్టపడి పనిచేసే ప్రతి కార్యకర్తకు పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని తెలిపారు. పార్టీ కోసం నిబద్ధతతో పనిచేసే వారికి తగిన ప్రాధాన్యత ఇస్తామని పేర్కొన్నారు.
ప్రజలతో మమేకమై పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన సూచించారు.గ్రామస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కార్యకర్తలు సమన్వయంతో ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు. పార్టీలో చేరిన కుటుంబాలకు అండగా ఉంటామని, పార్టీ కార్యక్రమాల్లో వారికి తగిన ప్రాధాన్యత కల్పిస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో బొల్లాపల్లి మండల పార్టీ అధ్యక్షులు కాకర్ల నారాయణరెడ్డి, తిప్పిశెట్టి కోటేశ్వరరావు, రాంబాబు నాయక్, జగన్ నాయక్తో పాటు పలువురు గ్రామ నాయకులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.




