Vinukonda: గుంటుపాలెంలో టీడీపీలోకి వైసీపీ నుంచి 35 కుటుంబాల చేరిక
Vinukonda: శావల్యాపురం మండలం గుంటుపాలెంలో మాజీ సర్పంచ్ చాగంటి శ్రీనివాసరావుతో సహా వైసీపీకి చెందిన 35 కుటుంబాలు ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు సమక్షంలో టీడీపీలో చేరారు.
Vinukonda: గుంటుపాలెంలో టీడీపీలోకి వైసీపీ నుంచి 35 కుటుంబాల చేరిక
Vinukonda: వినుకొండ నియోజకవర్గం, శావల్యాపురం మండలం గుంటుపాలెం గ్రామంలో వైసీపీకి చెందిన 35 కుటుంబాలు టీడీపీలో చేరారు.మాజీ సర్పంచ్ చాగంటి పచ్చం శ్రీనివాసరావు, చాగంటి అంజిబాబుతో పాటు మరో 33 కుటుంబాలకు చెందిన వారు ప్రభుత్వ చీఫ్ విప్, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు సమక్షంలో టీడీపీ కండువాలు కప్పుకున్నారు. ఈ సందర్భంగా జీవీ ఆంజనేయులు వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.
కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను చూసి ఆకర్షితులై టీడీపీలో చేరినట్లు తెలిపారు. గ్రామంలో పార్టీ బలోపేతానికి తమ వంతు కృషి చేస్తామని పేర్కొన్నారు.అనంతరం చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు మాట్లాడుతూ.. టీడీపీ అభ్యున్నతి కోసం కష్టపడి పనిచేసే ప్రతి కార్యకర్తకు పార్టీలో సముచిత స్థానం, తగిన ప్రాధాన్యత కల్పిస్తామని అన్నారు.
ప్రజా సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు సాంబయ్య, క్లస్టర్ ఇన్‌చార్జ్ కోటేశ్వరరావు, గడిపూడి విశ్వనాథం, చింత గంగయ్య, బొల్లా పేరయ్య, అన్నవరపు నరేంద్ర, గ్రామ పార్టీ అధ్యక్షుడు దగ్గుపాటి కృష్ణతో పాటు పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.




