Vinukonda: తుఫాను వర్షాలకు పంటల రక్షణపై ఏవో వరలక్ష్మి సూచనలు
Vinukonda: మురుసు తుఫాన్ ప్రభావంతో దెబ్బతిన్న వరి, మొక్కజొన్న పంటల రక్షణకు రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వినుకొండ ఏవో జి. వరలక్ష్మి కీలక సూచనలు.
Vinukonda: తుఫాను వర్షాలకు పంటల రక్షణపై ఏవో వరలక్ష్మి సూచనలు
వినుకొండ: మురసు తుఫాను ప్రభావం నేపథ్యంలో వినుకొండ మండల పరిధిలో వరి, మొక్కజొన్న సాగు చేసిన రైతులు పంటల రక్షణకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మండల వ్యవసాయాధికారి జి. వరలక్ష్మి సూచించారు. తుఫాను అనంతరం పంట పొలాల్లో తీసుకోవాల్సిన చర్యలపై రైతులకు ఆమె పలు సూచనలు చేశారు.
ఈదురుగాలుల కారణంగా వరి పంట నేలకొరిగినట్లయితే పొలాల్లో నీరు నిల్వ ఉండకుండా బయటకు పంపించాలని సూచించారు. తుఫాను ప్రభావం తగ్గిన తర్వాత పొలాల్లో నీరు తగ్గిన మేరకు పంట అవసరాలను బట్టి పోషక యాజమాన్య చర్యలు చేపట్టాలని తెలిపారు. మొక్కజొన్న
సాగు చేసిన పొలాల్లో నీరు నిల్వ ఉండకుండా వెంటనే మురుగు కాలువలు ఏర్పాటు చేయాలన్నారు. ఈదురుగాలులకు మొక్కలు పడిపోకుండా సాధ్యమైన చోట మొక్కల మొదళ్ల వద్ద మట్టిని ఎగదోయాలని సూచించారు.
ముఖ్యంగా కంకి దశలో ఉన్న పంటల్లో నీటిముంపు ఎక్కువ కాలం కొనసాగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కోతకు సిద్ధంగా ఉన్న కంకులను వర్షాలు తగ్గిన వెంటనే కోసి, తగిన విధంగా ఆరబెట్టాలని తెలిపారు. కోతకు రాని దశలో ఉన్న పంటల్లో అధిక నీటి నిల్వను నివారించాలని రైతులకు అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా చీకటిగలపాలెం గ్రామంలో వరి పంట పొలాలను వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఏఈవో ఆరిఫ్, వీఏఏ అపర్ణ, పలువురు రైతులు పాల్గొన్నారు.




