Vinukonda: వినుకొండ: ఆసగటు 3న 'వన్ మంత్.. వన్ కాన్స్టిట్యూయెన్సీ'!
Vinukonda: వినుకొండ వై కన్వెన్షన్‌లో ఆసగటు 3న 'వన్ మంత్.. ఫోర్ విజిట్స్' ఏర్పాట్లను పరిశీలించిన ఆర్డీవో. హాజరుకానున్న కలెక్టర్ కృత్తిక, జీవి ఆంజనేయులు.
Vinukonda: వినుకొండ: ఆసగటు 3న 'వన్ మంత్.. వన్ కాన్స్టిట్యూయెన్సీ'!
వినుకొండలో ఆగస్టు 3న ‘వన్ మంత్.. వన్ కాన్స్టిట్యూయెన్సీ.. ఫోర్ విజిట్స్’ కార్యక్రమం
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ప్రజా సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు ‘వన్ మంత్.. వన్ కాన్స్టిట్యూయెన్సీ.. ఫోర్ విజిట్స్’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు నరసరావుపేట ఆర్డీవో బాలకృష్ణ తెలిపారు. ఇప్పటికే పెదకూరపాడు, చిలకలూరిపేట నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించామని, తదుపరి ఆగస్టు 3న వినుకొండలో, కలెక్టర్ కృత్తిక శుక్ల, చీఫ్ విప్ జీవి ఆంజనేయులు ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు.
ఈ నేపథ్యంలో వినుకొండ పట్టణంలోని తిమ్మాయపాలెం రోడ్డులో ఉన్న వై కన్వెన్షన్ హాల్‌ను ఆర్డీవో బాలకృష్ణ సందర్శించారు. కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించి, అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. వినుకొండ నియోజకవర్గ పరిధిలోని ఐదు మండలాలతో పాటు వినుకొండ మున్సిపాలిటీ పరిధిలోని ప్రజలు తమ సమస్యలను అధికారుల దృష్టికి నేరుగా తీసుకురావచ్చని తెలిపారు.ప్రజలు అందించే సమస్యలు, వినతులను సంబంధిత శాఖల అధికారులు పరిశీలించి, సాధ్యమైనంత త్వరగా పరిష్కరించేలా చర్యలు తీసుకుంటారని పేర్కొన్నారు. ముఖ్యంగా నెలలోపు సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చిన ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఆర్డీవో బాలకృష్ణ కోరారు.




