Vinukonda: వినుకొండ దస్తావేజు లేఖర్ల దీక్షకు బొల్లా బ్రహ్మనాయుడు సంఘీభావం
Vinukonda: వినుకొండలో దస్తావేజు లేఖర్ల పెన్‌డౌన్ నిరసనకు వైసీపీ సంఘీభావం. జీవో 396ను తక్షణమే రద్దు చేయాలని మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు డిమాండ్.
Vinukonda: వినుకొండ దస్తావేజు లేఖర్ల దీక్షకు బొల్లా బ్రహ్మనాయుడు సంఘీభావం
వినుకొండ: వినుకొండలో దస్తావేజు లేఖర్లు చేపట్టిన పెన్‌డౌన్ నిరసనకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సంఘీభావం తెలిపింది. 396 జీవోను తక్షణమే రద్దు చేసి దస్తావేజు లేఖర్లకు న్యాయం చేయాలని మాజీ ఎమ్మెల్యే, వైసీపీ పీఏసీ సభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు డిమాండ్ చేశారు.
దస్తావేజు లేఖర్ల పెన్‌డౌన్ నిరసన 10వ రోజుకు చేరుకున్న నేపథ్యంలో, ఆయన దీక్షా శిబిరాన్ని సందర్శించి లేఖర్లకు సంఘీభావం తెలిపారు.ఈ సందర్భంగా బొల్లా బ్రహ్మనాయుడు మాట్లాడుతూ.. 396 జీవో కారణంగా దస్తావేజు లేఖర్ల ఉపాధి దెబ్బతింటోందని విమర్శించారు.
ప్రభుత్వం కొత్తగా ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెబుతూ, ఇప్పటికే వృత్తిపై ఆధారపడి జీవిస్తున్న వారి ఉపాధిని దెబ్బతీయడం సరికాదన్నారు. ఈ నిర్ణయం వల్ల దస్తావేజు లేఖర్లతో పాటు రైతులు, సామాన్య ప్రజలు కూడా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందని పేర్కొన్నారు.
ఆస్తుల రిజిస్ట్రేషన్లపై దస్తావేజు లేఖర్లకు పూర్తి అవగాహన ఉందని, వృత్తిలో ఏవైనా లోపాలు ఉంటే వాటిని సరిదిద్దాలే తప్ప, వారి ఉపాధిని పూర్తిగా దెబ్బతీయడం తగదన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి 396 జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేఖర్ల సమస్యను వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోసం తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.




