Vinukonda: స్థానిక ఎన్నికలకు సమాయత్తం కావాలి - మాజీ ఎమ్మెల్యే బొల్లా

Vinukonda: వినుకొండలో వైఎస్సార్‌సీపీ నియోజకవర్గస్థాయి విస్తృత సమావేశం. స్థానిక ఎన్నికలకు సిద్ధం కావాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చిన బొల్లా బ్రహ్మనాయుడు.

KAREEMULLA, VINUKONDA
Published on: 11 Sept 2026 10:41 PM IST
Vinukonda
X

Vinukonda: స్థానిక ఎన్నికలకు సమాయత్తం కావాలి - మాజీ ఎమ్మెల్యే బొల్లా

వినుకొండ: రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను ఎదుర్కొనేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సమష్టిగా సిద్ధం కావాలని ఆ పార్టీ PAC సభ్యులు, వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు పిలుపునిచ్చారు. శుక్రవారం వినుకొండ పట్టణంలోని బ్రహ్మనాయుడు కన్వెన్షన్ హాల్‌లో ఆయన ఆధ్వర్యంలో వైఎస్సార్‌సీపీ నియోజకవర్గస్థాయి విస్తృత సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా బొల్లా బ్రహ్మనాయుడు మాట్లాడుతూ.. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు పార్టీకి కీలకమని, వాటిని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు నాయకులు, కార్యకర్తలు ఇప్పటి నుంచే కార్యాచరణ రూపొందించుకోవాలని సూచించారు. ప్రతి వార్డు, ప్రతి గ్రామంలో పార్టీ బలాన్ని మరింత పెంచేలా నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని తెలిపారు.

కష్టకాలంలో పార్టీ కోసం అంకితభావంతో పనిచేసిన ప్రతి నాయకుడు, కార్యకర్తకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలో శ్రేణులంతా ఐక్యంగా ముందుకు సాగాలని సూచించారు. ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు గుర్తించి, వాటి పరిష్కారానికి కృషి చేస్తూ ప్రజలకు మరింత చేరువ కావాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.

స్థానిక ఎన్నికల్లో పార్టీ విజయానికి ప్రతి కార్యకర్త బాధ్యత తీసుకుని పనిచేయాలని, గ్రామస్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు పార్టీని మరింత పటిష్టం చేయాలని బొల్లా బ్రహ్మనాయుడు కోరారు.కార్యక్రమంలో వినుకొండ నియోజకవర్గ పరిశీలకులు బాసు లింగారెడ్డి, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అనుబంధ విభాగాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

KAREEMULLA, VINUKONDA

KAREEMULLA, VINUKONDA