Vinukonda: వినుకొండలో ప్రజల సమస్యల స్వీకరణ చీఫ్ విప్, కలెక్టర్!

Vinukonda: వినుకొండలో 'వన్ మంత్.. వన్ కాన్స్టిట్యూయెన్సీ.. ఫోర్ విజిట్స్' గ్రీవెన్స్. చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు, కలెక్టర్ కృతికా శుక్లా ఆధ్వర్యంలో 200+ అర్జీల స్వీకరణ.

KAREEMULLA, VINUKONDA
Published on: 3 Aug 2026 4:14 PM IST
Vinukonda
X

Vinukonda: వినుకొండలో ప్రజల సమస్యల స్వీకరణ చీఫ్ విప్, కలెక్టర్!

వినుకొండ: వినుకొండ నియోజకవర్గంలో ‘వన్ మంత్.. వన్ కాన్స్టిట్యూయెన్సీ.. ఫోర్ విజిట్స్’ కార్యక్రమంలో భాగంగా ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని పల్నాడు జిల్లా కలెక్టర్ కృతికా శుక్ల ఆధ్వర్యంలో నిర్వహించినట్లు చీఫ్ విప్ జీవి. ఆంజనేయులు తెలిపారు.

వినుకొండ పట్టణంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి 200కు పైగా గ్రీవెన్స్ అందినట్లు ఆయన వెల్లడించారు. ప్రజలు తమ సమస్యలను నేరుగా జిల్లా అధికారుల దృష్టికి తీసుకువచ్చి పరిష్కారం పొందేలా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

గత రెండు నెలల్లో పెద్దకూరపాడు, చిలకలూరిపేట నియోజకవర్గాల్లో ‘వన్ మంత్.. వన్ కాన్స్టిట్యూయెన్సీ.. ఫోర్ విజిట్స్’ కార్యక్రమాన్ని నిర్వహించామని, ఈ నెలలో వినుకొండ నియోజకవర్గంలో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు. ప్రజలు తమ సమస్యల కోసం నరసరావుపేటకు రావాల్సిన అవసరం లేకుండా, జిల్లా స్థాయి అధికారులు నేరుగా నియోజకవర్గానికి వచ్చి గ్రీవెన్స్ స్వీకరిస్తున్నారని తెలిపారు.

వచ్చే మూడు వారాల్లో ఈపూరు, నూజెండ్ల, బొల్లాపల్లి, శావల్యాపురం మండలాల్లో కూడా కార్యక్రమాలను నిర్వహించి ప్రజల సమస్యలను తెలుసుకుంటామని చెప్పారు. ముఖ్యంగా రీ-సర్వే, రెవెన్యూ శాఖకు సంబంధించిన సమస్యలపై అధిక సంఖ్యలో ఫిర్యాదులు వచ్చినట్లు తెలిపారు. అగ్రహారం గ్రామాలకు సంబంధించిన సమస్యలను కూడా పరిశీలించి, వాటి పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ కృతికా శుక్ల వెల్లడించారు.

KAREEMULLA, VINUKONDA

KAREEMULLA, VINUKONDA

Next Story