Vinukonda: వినుకొండలో ‘ఇంటింటికీ ఎన్డీఏ ప్రభుత్వం’ కార్యక్రమం
Vinukonda: వినుకొండలో చీఫ్ విప్ జీవీ అంజనేయులు ఆధ్వర్యంలో ఇంటింటికీ ఎన్డీఏ ప్రభుత్వం కార్యక్రమం. సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించిన ఎమ్మెల్యే.
Vinukonda: వినుకొండలో ‘ఇంటింటికీ ఎన్డీఏ ప్రభుత్వం’ కార్యక్రమం
వినుకొండ: వినుకొండ పట్టణంలోని ఇందిరానగర్‌లో చీఫ్ విప్, వినుకొండ ఎమ్మెల్యే జీవీ అంజనేయులు ఆధ్వర్యంలో ‘ఇంటింటికీ ఎన్డీఏ ప్రభుత్వం’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతి ఇంటిని సందర్శించిన చీఫ్ విప్ జీవీ అంజనేయులు.. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన గత రెండేళ్లలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు.
ప్రజా ప్రభుత్వం అందిస్తున్న సుపరిపాలనకు ప్రజల నుంచి అపూర్వ స్పందన లభిస్తోందని తెలిపారు.'ప్రతి ఇంటికీ సూపర్ సిక్స్.. ప్రతి కుటుంబానికి సంక్షేమం’ అనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు.
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఉచిత గ్యాస్ సిలిండర్లు, ‘తల్లికి వందనం’ పథకం, సామాజిక భద్రతా పెన్షన్లను రూ.3 వేల నుంచి రూ.4 వేలకు పెంచడం వంటి సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు చేరువయ్యాయని పేర్కొన్నారు.
సూపర్ సిక్స్ పథకాల ద్వారా రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి ప్రత్యక్షంగా లబ్ధి చేకూరుతోందన్నారు.మహిళలు ఉచిత బస్సు ప్రయాణాన్ని విస్తృతంగా వినియోగించుకుంటున్నారని తెలిపారు. పోలవరం వంటి కీలక ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని చీఫ్ విప్ జీవీ అంజనేయులు పేర్కొన్నారు.




