Vinukonda: ప్రజాదర్బార్‌లో 24 అర్జీలు స్వీకరించిన చీఫ్ విప్ జీవీ
Vinukonda: వినుకొండలో ఘనంగా నిర్వహించిన ప్రజాదర్బార్. వివిధ సమస్యలపై 24 అర్జీలు స్వీకరించి, సంతృప్తికర పరిష్కారం చూపాలని అధికారులను ఆదేశించిన చీఫ్ విప్ జీవీ.
Vinukonda: ప్రజాదర్బార్‌లో 24 అర్జీలు స్వీకరించిన చీఫ్ విప్ జీవీ
వినుకొండ: వినుకొండ నియోజకవర్గ ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని సత్వర పరిష్కారం చూపడమే ప్రజాదర్బార్ లక్ష్యమని ఏపీ ప్రభుత్వ చీఫ్ విప్, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అన్నారు.
వినుకొండ మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజాదర్బార్‌లో 24 అర్జీలను స్వీకరించిన ఆయన, సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యలను నిర్దేశిత కాలపరిమితిలో పరిష్కరించాలని ఆదేశించారు.ప్రజాదర్బార్‌లో విద్యుత్, తాగునీరు, భూ సమస్యలు, రహదారులు, వీధి దీపాలు, ఇంటి పన్నులు, స్మశాన వాటికకు దారి, గృహ నిర్మాణానికి అడ్డుగా ఉన్న విద్యుత్ తీగలు తదితర సమస్యలపై ప్రజలు అర్జీలు అందజేశారు.
విష్ణుకుండి నగర్‌లో కొత్త విద్యుత్ స్తంభం ఏర్పాటు చేయాలని వచ్చిన అర్జీపై ఏడీ ఎలక్ట్రికల్‌కు చర్యలు తీసుకోవాలని సూచించారు. భూముల ఆన్‌లైన్ నమోదు, 1-బి, అడంగల్ సమస్యలను పరిశీలించి పరిష్కరించాలని సంబంధిత తహసీల్దార్లకు సిఫారసు చేశారు.
బొగ్గరం గ్రామంలోని విశ్వబ్రాహ్మణుల స్మశాన వాటికకు దారిని పునరుద్ధరించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పలు వార్డుల్లో తాగునీరు, పబ్లిక్ ట్యాపులు, వీధి దీపాల ఏర్పాటుపై వచ్చిన అర్జీలను పరిశీలించాలని మున్సిపల్ అధికారులకు సూచించారు.
అర్జీ పరిష్కరించామని చెప్పడం కాకుండా, అర్జీదారుడికి సంతృప్తి కలిగేలా సమస్యను పరిష్కరించాలన్నారు. నిర్ణీత గడువులో సమస్యలు పరిష్కరించకపోతే ఫిర్యాదులు రీ-ఓపెన్ అయ్యే అవకాశం ఉందని తెలిపారు. పీజీఆర్ఎస్‌లో మెరుగైన పనితీరు కనబరిచే శాఖలను గుర్తించి అధికారులను అభినందిస్తామని జీవీ పేర్కొన్నారు.




