Vinukonda: వినుకొండలో ఘనంగా స్వాతంత్ర్య వేడుకలు జీవీ ఆంజనేయులు
Vinukonda: వినుకొండ ప్రభుత్వ చీఫ్ విప్ కార్యాలయంలో ఘనంగా 80వ స్వాతంత్ర్య వేడుకలు. జాతీయ జెండా ఆవిష్కరించిన ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు.
Vinukonda: వినుకొండలో ఘనంగా స్వాతంత్ర్య వేడుకలు జీవీ ఆంజనేయులు
వినుకొండ: 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని వినుకొండలోని ప్రభుత్వ చీఫ్ విప్ కార్యాలయంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి చీఫ్ విప్, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.
పాఠశాల విద్యార్థులతో కలిసి వేడుకల్లో పాల్గొన్న జీవి వారికి స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. చిన్నారులతో ఆప్యాయంగా ముచ్చటిస్తూ దేశభక్తి, జాతీయ సమైక్యత, దేశం పట్ల బాధ్యత వంటి విలువలను అలవరచుకోవాలని సూచించారు.
విద్యార్థులే దేశ భవిష్యత్తుకు పునాదులని ఆయన తెలిపారు . చిన్ననాటి నుంచే విద్యార్థుల్లో దేశభక్తి, క్రమశిక్షణ, సామాజిక బాధ్యతను పెంపొందించాలని సూచించారు.
కష్టపడి చదివి విద్యలో రాణిస్తూ తల్లిదండ్రులకు, గురువులకు, సమాజానికి, దేశానికి మంచి పేరు తీసుకురావాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు.




