Vinukonda: రూ.10 తక్కువకే బీపీటీ బియ్యం చీఫ్ విప్ జి.వి. ఆంజనేయులు
Vinukonda: వినుకొండలో బహిరంగ మార్కెట్ కంటే కిలోకు రూ.10 తక్కువకే బీపీటీ బియ్యం పంపిణీ ప్రారంభించిన ప్రభుత్వ చీఫ్ విప్, ఎమ్మెల్యే జి.వి. ఆంజనేయులు.
Vinukonda: రూ.10 తక్కువకే బీపీటీ బియ్యం చీఫ్ విప్ జి.వి. ఆంజనేయులు
వినుకొండ: వినుకొండ పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయంలో బహిరంగ మార్కెట్ ధర కంటే కిలోకు రూ.10 తక్కువ ధరకు బీపీటీ బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రభుత్వ చీఫ్ విప్, వినుకొండ ఎమ్మెల్యే జీ.వీ. ఆంజనేయులు సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన లబ్ధిదారులకు బియ్యం ప్యాకెట్లను స్వయంగా అందజేశారు.
ఈ సందర్భంగా జీ.వీ. ఆంజనేయులు మాట్లాడుతూ.. పేద, మధ్యతరగతి కుటుంబాలపై నిత్యావసర వస్తువుల ధరల భారాన్ని తగ్గించడమే లక్ష్యంగా ప్రభుత్వం తక్కువ ధరకే బీపీటీ బియ్యాన్ని అందుబాటులోకి తీసుకువచ్చిందన్నారు. బహిరంగ మార్కెట్ ధరలతో పోలిస్తే కిలోకు రూ.10 తక్కువ ధరకు నాణ్యమైన బియ్యం అందించడం ద్వారా సామాన్య ప్రజలకు ఆర్థికంగా కొంత ఊరట కలుగుతుందని తెలిపారు.
ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక కార్యక్రమాలను అమలు చేస్తోందని, అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీ బియ్యం పంపిణీ ద్వారా పేద, మధ్యతరగతి ప్రజలకు ప్రయోజనం చేకూరుతుందని అధికారులు తెలిపారు.




