Vinukonda: వినుకొండ తొలి ఏకాదశి తిరునాళ్లకు పకడ్బందీ ఏర్పాట్లు
Vinukonda: వినుకొండ శ్రీ రామలింగేశ్వర స్వామి తిరునాళ్లపై అధికారులతో చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు సమీక్ష. భక్తులకు అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలని ఆదేశం.
Vinukonda: వినుకొండ తొలి ఏకాదశి తిరునాళ్లకు పకడ్బందీ ఏర్పాట్లు
వినుకొండ: తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని ఈ నెల 25న వినుకొండ పట్టణంలోని శ్రీ రామలింగేశ్వర స్వామి కొండపై జరిగే తిరునాళ్ల కు సంబంధించిన ఏర్పాట్లపై ప్రభుత్వ చీఫ్ విప్, ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు మున్సిపల్ కార్యాలయంలో ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో పల్నాడు జిల్లా జాయింట్ కలెక్టర్ వి. సంజన సిన్హా,ఆర్డీవో, దేవాదాయ శాఖ కమిషనర్‌తో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. పండుగకు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చే నేపథ్యంలో వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని చీఫ్ విప్ అధికారులను ఆదేశించారు.
తాగునీరు, పారిశుధ్యం, నిరంతర విద్యుత్ సరఫరా, ట్రాఫిక్ నియంత్రణ, పోలీసు భద్రత, వైద్య సేవలు, ఆర్టీసీ ప్రత్యేక బస్సుల ఏర్పాటు వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. అన్ని శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేసి, ప్రతి ఏర్పాటును ముందుగానే పూర్తి చేసి భక్తులకు సురక్షితమైన, సౌకర్యవంతమైన వాతావరణం కల్పిస్తూ తొలి ఏకాదశి తిరుణాళ్ళను విజయవంతం చేయాలని అధికారులకు స్పష్టం చేశారు.




