Vinukonda: పెన్‌డౌన్ నిరసన: జీఓ నెం. 396ను రద్దు చేయాలని డిమాండ్!

Vinukonda: వినుకొండ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద దస్తావేజు లేఖర్ల పెన్‌డౌన్ నిరసన.

KAREEMULLA, VINUKONDA
Published on: 20 July 2026 1:30 PM IST
Vinukonda
X

Vinukonda: పెన్‌డౌన్ నిరసన: జీఓ నెం. 396ను రద్దు చేయాలని డిమాండ్!

Vinukonda: వినుకొండలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీఓ నెం.396కు వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దస్తావేజు లేఖరుల సంక్షేమ సంఘం పిలుపు మేరకు సోమవారం దస్తావేజు లేఖరులు పెన్‌డౌన్ నిర్వహించారు. సబ్‌ రిజిస్ట్రార్ కార్యాలయం ముందు నల్ల బ్యాడ్జీలు ధరించి, కరపత్రాలతో నిరసన వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జీఓ నెం. 396ను వెంటనే రద్దు చేసి, పీపీపీ విధానంలో ఏర్పాటు చేస్తున్న రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాల (ఆర్‌ఎస్‌కే) నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ జీఓ అమలైతే దస్తావేజు లేఖరులు, వారి సహాయకులు, కంప్యూటర్ ఆపరేటర్లు, స్టాంపు వెండర్లు ఉపాధి కోల్పోయి వేలాది కుటుంబాలు ఇబ్బందులు ఎదుర్కొంటాయని ఆందోళన వ్యక్తం చేశారు.

దశాబ్దాలుగా ప్రజలకు సేవలందిస్తున్న తమ వృత్తికి భరోసా కల్పించాలని కోరారు. ప్రభుత్వం జీఓను రద్దు చేసే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని హెచ్చరించారు.

KAREEMULLA, VINUKONDA

KAREEMULLA, VINUKONDA

Next Story