Vinukonda: ఘనంగా వైఎస్ రాజశేఖరరెడ్డి 17వ వర్ధంతి వేడుకలు
Vinukonda: వినుకొండలో వైఎస్సార్ 17వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు వైఎస్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
Vinukonda: ఘనంగా వైఎస్ రాజశేఖరరెడ్డి 17వ వర్ధంతి వేడుకలు
వినుకొండ: దివంగత మహానేత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 17వ వర్ధంతి కార్యక్రమాన్ని వినుకొండలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు పాల్గొని వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా బొల్లా బ్రహ్మనాయుడు మాట్లాడుతూ.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేసిన సేవలు ఎప్పటికీ మరువలేనివని అన్నారు. ముఖ్యమంత్రిగా తనదైన పాలనతో పేదలు, రైతులు, విద్యార్థులు, బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి పెద్దపీట వేశారని పేర్కొన్నారు.
పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకొచ్చి ఎంతోమంది నిరుపేద కుటుంబాలకు అండగా నిలిచారని అన్నారు. విద్యార్థుల ఉన్నత చదువులకు ఫీజు రీయింబర్స్‌మెంట్, రైతులకు ఉచిత విద్యుత్ వంటి అనేక సంక్షేమ పథకాలను అమలు చేసి ప్రజల మనసుల్లో చెరగని ముద్ర వేసుకున్నారని తెలిపారు.
పేదల సంక్షేమమే లక్ష్యంగా పనిచేసిన వైఎస్సార్‌ను ప్రజలు ఎప్పటికీ గుర్తుంచుకుంటారని అన్నారు. తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన వైఎస్సార్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే ఆయనకు ఇచ్చే నిజమైన నివాళి అని బొల్లా బ్రహ్మనాయుడు పేర్కొన్నారు.




