Vinukonda: వినుకొండలో కూటమి రెండేళ్ల విజయోత్సవ సభ
Vinukonda: పల్నాడు జిల్లా వినుకొండలో కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలన విజయోత్సవ సభ అత్యంత ఘనంగా జరిగింది.
Vinukonda: వినుకొండలో కూటమి రెండేళ్ల విజయోత్సవ సభ
Vinukonda: కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా వినుకొండలో విజయోత్సవ సభ ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ చీఫ్ విప్ కార్యాలయం నుంచి భారీ ర్యాలీ నిర్వహించి గంగినేని ఫంక్షన్ హాల్‌కు చేరుకున్నారు. ఈ సభకు ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు, నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానంద రెడ్డి, సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్సీ బి.టి. నాయుడు, మాజీ ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఐదేళ్ల వైసీపీ దుర్మార్గపు పాలనలో నాసిరకం బ్రాందీ విస్కీలతో వేలాదిమంది ప్రాణాలను జగన్మోహన్ రెడ్డి బలిగొన్నడని తెలిపారు. ప్రతి బిడ్డకు అమ్మబడి ఇస్తామని ఒక బిడ్డకే ఇచ్చి మోసం చేసింది మీరు కాదా? అని ప్రశ్నించారు. రాష్ట్రాన్ని అవినీతితో లూటీ చేసి దోచుకున్నారని ఆరోపించారు.వైసీపీ చేస్తున్న దుష్ప్రచారాలను తిప్పి కొట్టాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలో ఘన విజయం సాధించాలన్నారు.
కూటమి ప్రభుత్వం రెండేళ్లలో సాధించిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను నాయకులు వివరించారు. భారీ సంఖ్యలో కూటమి శ్రేణులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని సభను విజయవంతం చేశారు.




