Vinukonda: వినుకొండ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: తహసీల్దార్ సురేష్
Vinukonda: తుఫాను ప్రభావంతో నవంబర్ 2, 3, 4 తేదీల్లో వినుకొండలో 110 కిమీ వేగంతో గాలులు, భారీ వర్షాలు కురిసే అవకాశముందని తహసీల్దార్ సురేష్ తెలిపారు. హెల్ప్‌లైన్ ఏర్పాటు.
Vinukonda: వినుకొండ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: తహసీల్దార్ సురేష్
వినుకొండ: జిల్లా కలెక్టర్ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ (APSDMA) ఆదేశాల మేరకు రానున్న మూడు రోజుల పాటు వినుకొండ మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తహసీల్దార్ సురేష్ సూచించారు. తుఫాను ప్రభావంతో నవంబర్ 2, 3, 4 తేదీల్లో మండల పరిధిలో గంటకు 100 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచడంతో పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.
ఈ నేపథ్యంలో ప్రజలు అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని, విద్యుత్ తీగలను తాకవద్దని, వర్షపు నీరు ప్రవహించే రహదారులను దాటవద్దని సూచించారు. లోతట్టు ప్రాంతాలు, మట్టి ఇళ్లు, రేకుల ఇళ్లలో నివసించే వారు ముందస్తుగా అప్రమత్తమై సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని కోరారు. అత్యవసర సహాయం కోసం 96429 76534 నంబర్‌ను సంప్రదించాలని తెలిపారు. తుఫాను సమయంలో ప్రజలు రెవెన్యూ, పోలీస్, మున్సిపల్, పంచాయతీరాజ్ శాఖల అధికారులకు సహకరించాలని తహసీల్దార్ సురేష్ విజ్ఞప్తి చేశారు.




