Vinukonda: వినుకొండలో మెగా జాబ్ మేళా - చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు

Vinukonda: వినుకొండలో ఏపీఎస్‌ఎస్‌డీసీ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహించారు. 46 ప్రముఖ కంపెనీలు పాల్గొన్న ఈ మేళాను చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు ప్రారంభించారు.

KAREEMULLA, VINUKONDA
Updated on: 7 Oct 2026 4:24 PM IST
Vinukonda
X

Vinukonda: వినుకొండలో మెగా జాబ్ మేళా - చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు

వినుకొండ: నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (APSSDC) ఆధ్వర్యంలో వినుకొండ పట్టణంలోని జూనియర్ కళాశాల ప్రాంగణంలో మెగా జాబ్ మేళా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ చీఫ్ విప్, వినుకొండ ఎమ్మెల్యే జి.వి. ఆంజనేయులు ముఖ్య అతిథిగా హాజరై జాబ్ మేళాను ప్రారంభించారు.ఈ సందర్భంగా జి.వి. ఆంజనేయులు మాట్లాడుతూ.. మెగా జాబ్ మేళాకు నియోజకవర్గంతో పాటు పరిసర ప్రాంతాల నుంచి సుమారు 2 వేల మంది యువతీ యువకులు హాజరైనట్లు తెలిపారు.

వివిధ రంగాలకు చెందిన 46 ప్రముఖ కంపెనీలు జాబ్ మేళాలో పాల్గొని యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాయని పేర్కొన్నారు.10వ తరగతి నుంచి ఇంజినీరింగ్ వరకు వివిధ విద్యార్హతలు కలిగిన యువతకు తమ విద్యార్హతలకు అనుగుణంగా ఉద్యోగ అవకాశాలు అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. యువతలో ఉన్న ప్రతిభను గుర్తించి వారికి తగిన ఉపాధి అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.

గతంలో వినుకొండ నియోజకవర్గంలో నిర్వహించిన యువగళం పాదయాత్ర సందర్భంగా యువ నాయకుడు నారా లోకేష్ రాష్ట్రంలోని యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారని జి.వి. ఆంజనేయులు గుర్తు చేశారు. ఆ హామీని కూటమి ప్రభుత్వం దశలవారీగా అమలు చేస్తోందని తెలిపారు.

రాష్ట్రంలోని యువతకు ప్రభుత్వం కొండంత అండగా ఉంటుందని, ఉద్యోగ, ఉపాధి అవకాశాలను మరింత విస్తృతం చేసేందుకు నిరంతరం కృషి చేస్తామని జి.వి. ఆంజనేయులు పేర్కొన్నారు. యువత ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకుని తమ భవిష్యత్తుకు బలమైన పునాది వేసుకోవాలని ఆయన సూచించారు.

KAREEMULLA, VINUKONDA

KAREEMULLA, VINUKONDA