Vinukonda: భవిష్యత్ తరాల కోసమైనా పర్యావరణాన్ని కాపాడాలి.. చీఫ్ విప్

Vinukonda: అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ వినుకొండ ఎమ్మెల్యే జీవీ. ఆంజనేయులు వినూత్నంగా సైకిల్ తొక్కుతూ వెళ్లి మొక్కలు నాటారు.

KAREEMULLA, VINUKONDA
Published on: 5 Jun 2026 5:08 PM IST
Vinukonda
X

Vinukonda: భవిష్యత్ తరాల కోసమైనా పర్యావరణాన్ని కాపాడాలి.. చీఫ్ విప్

Vinukonda: అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని వినుకొండ మండలం అందుగుల కొత్తపాలెం గ్రామంలోని గుండ్లకమ్మ నది ఒడ్డున హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం, వినుకొండ మున్సిపల్ కార్యాలయ ఆవరణలో పర్యావరణ పరిరక్షణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చీఫ్ విప్, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో చైతన్యం కల్పించాలనే ఉద్దేశంతో ఆయన స్వయంగా సైకిల్ తొక్కుతూ అందుగుల కొత్తపాలెం గ్రామానికి చేరుకోవడం విశేషంగా నిలిచింది. అనంతరం గుండ్లకమ్మ నది పరివాహక ప్రాంతంలో గ్రామస్థులతో కలిసి మొక్కలు నాటారు. ప్రతి వ్యక్తి ప్రకృతిని ప్రేమించి చెట్లను పెంచాలని, పర్యావరణ సమతుల్యతను కాపాడటానికి మొక్కలు నాటడమే కాకుండా వాటిని సంరక్షించాల్సిన బాధ్యత కూడా అందరిపై ఉందని ఆయన పేర్కొన్నారు. భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించేందుకు ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని చీఫ్ విప్ పిలుపునిచ్చారు.

KAREEMULLA, VINUKONDA

KAREEMULLA, VINUKONDA

Next Story