Vinukonda: రెండు ప్రత్యేక ఆధార్ కేంద్రాలు జూలై 21 నుంచి సేవలు!
Vinukonda: మున్సిపాలిటీ పరిధిలో రెండు ప్రత్యేక ఆధార్ కేంద్రాల ఏర్పాటు. జూలై 21 నుండి 24 వరకు కొత్త నమోదు, వివరాల మార్పు సేవలు అందుబాటులో ఉంటాయని కమిషనర్ వెల్లడి.
Vinukonda: రెండు ప్రత్యేక ఆధార్ కేంద్రాలు జూలై 21 నుంచి సేవలు!
Vinukonda: వినుకొండ పురపాలక సంఘం పరిధిలో ప్రజలకు ఆధార్ సేవలను మరింత సులభంగా అందించేందుకు రెండు ప్రత్యేక ఆధార్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు పురపాలక కమిషనర్ కె. శివరామ ప్రసాద్ తెలిపారు. ఎన్ఎస్పీ కాలనీలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో ఒక కేంద్రం, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల( ఉర్దూ) ఆవరణలో మరో కేంద్రం ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.
ఈ కేంద్రాల్లో జూలై 21వ తేదీ నుండి 24వ తేదీ వరకు కొత్త ఆధార్ నమోదు, వివరాల సవరణ, చిరునామా మార్పు, మొబైల్ నంబర్ నవీకరణ, బయోమెట్రిక్ అప్‌డేట్‌తో పాటు ఆధార్‌కు సంబంధించిన అన్ని రకాల సేవలు అందుబాటులో ఉంటాయని చెప్పారు. ప్రజలు ఆధార్ సేవల కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా స్థానికంగానే ఈ సేవలను పొందవచ్చని పేర్కొన్నారు. ముఖ్యంగా విద్యార్థులు, వృద్ధులు, మహిళలు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని సూచించారు. పట్టణ ప్రజలందరూ ఈ ప్రత్యేక ఆధార్ కేంద్రాలను సద్వినియోగం చేసుకుని అవసరమైన సేవలను పొందాలని కమిషనర్ శివరామ ప్రసాద్ విజ్ఞప్తి చేశారు.




