Vinukonda: వినుకొండలో వైసీపీ అభ్యర్థులను గెలిపించండి: సలేహా ఖాన్!
Vinukonda: వినుకొండ మున్సిపాలిటీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని చైర్మన్ అభ్యర్థి పఠాన్ సలేహా ఖాన్ 31, 32, 33 వార్డుల్లో ప్రచారం చేశారు.
Vinukonda: వినుకొండలో వైసీపీ అభ్యర్థులను గెలిపించండి: సలేహా ఖాన్!
వినుకొండ: రానున్న మున్సిపల్ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను అఖండ మెజారిటీతో గెలిపించాలని ఆ పార్టీ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి పఠాన్ సలేహా ఖాన్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.ఎన్నికల ప్రచారంలో భాగంగా వినుకొండ పట్టణంలోని 31,32,33 వ వార్డుల్లో ఆయన విస్తృతంగా పర్యటించారు.
ఈ సందర్భంగా ఆయా వార్డుల్లోని ప్రజలను, ఓటర్లను నేరుగా కలుసుకుని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని కోరారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రజలకు అందించిన సంక్షేమ పథకాలు, చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు.ప్రజల సంక్షేమం, పట్టణ అభివృద్ధి లక్ష్యంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పనిచేసిందని ఆయన పేర్కొన్నారు.
రానున్న మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించడం ద్వారా ప్రజాసేవకు మరింత అవకాశం కల్పించాలని కోరారు.తాను మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నేపథ్యంలో, వినుకొండ మున్సిపాలిటీలోని మొత్తం 36 వార్డుల్లో పోటీ చేస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, సీపీఐ అభ్యర్థులకు ప్రజలు తమ అమూల్యమైన ఓటు వేసి అభ్యర్థులను అఖండ మెజారిటీతో గెలిపించాలని పఠాన్ సలేహా ఖాన్ కోరారు.




