Vinukonda: వినుకొండ మండల పరిషత్ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారం

Vinukonda: వినుకొండ మండల పరిషత్ కార్యాలయంలో నూతన ఎంపీపీగా రమాదేవి, వైస్ ఎంపీపీగా వజ్రాల వెంకట నాగలక్ష్మి, ఎంపీటీసీ సభ్యులు శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు.

KAREEMULLA, VINUKONDA
Published on: 20 Nov 2026 4:21 PM IST
Vinukonda
X

Vinukonda: వినుకొండ మండల పరిషత్ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారం

వినుకొండ: వినుకొండ మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం నూతనంగా ఎన్నికైన ఎంపీటీసీ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రొసీడింగ్ ఆఫీసర్ హీరాలాల్ నాయక్ నూతనంగా ఎన్నికైన ఎంపీటీసీ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు.

అనంతరం నూతనంగా ఎన్నికైన మండల పరిషత్ అధ్యక్షురాలు, ఉపాధ్యక్షురాలితో ప్రమాణ స్వీకారం చేయించి బాధ్యతలు అప్పగించారు.పిట్టంబండ ఎంపీటీసీ సభ్యురాలు రమాదేవి మండల పరిషత్ అధ్యక్షురాలిగా (ఎంపీపీ) ప్రమాణ స్వీకారం చేయగా, విఠంరాజుపల్లి ఎంపీటీసీ సభ్యురాలు వజ్రాల వెంకట నాగలక్ష్మి మండల పరిషత్ ఉపాధ్యక్షురాలిగా (వైస్ ఎంపీపీ) బాధ్యతలు స్వీకరించారు.

ఈ సందర్భంగా నూతన ఎంపీపీ, వైస్ ఎంపీపీ మాట్లాడుతూ.. వినుకొండ మండలంలోని అన్ని గ్రామాల సమగ్ర అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామని తెలిపారు. గ్రామాల్లో నెలకొన్న ప్రజా సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తామని పేర్కొన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యులు, మండల స్థాయి టీడీపీ నాయకులు, కార్యకర్తలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఎంపీపీ, వైస్ ఎంపీపీకి పలువురు శుభాకాంక్షలు తెలిపారు.

KAREEMULLA, VINUKONDA

KAREEMULLA, VINUKONDA