Vinukonda: బొల్లా బ్రహ్మనాయుడిపై జీవీ ఆంజనేయులు సంచలన ఆరోపణలు!

Vinukonda: వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడుపై ఏపీ ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

KAREEMULLA, VINUKONDA
Published on: 29 Jun 2026 6:15 AM IST
Vinukonda
X

Vinukonda: బొల్లా బ్రహ్మనాయుడిపై జీవీ ఆంజనేయులు సంచలన ఆరోపణలు!

వినుకొండ: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చీఫ్ విప్, ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడుపై తీవ్ర ఆరోపణలు చేశారు. గత వైసీపీ పాలనలో అధికారాన్ని అడ్డం పెట్టుకుని ప్రైవేటు, ప్రభుత్వ భూములను ఆక్రమించారని ఆరోపించారు. తెలంగాణలోనూ భారీ భూ కబ్జా కేసులో అరెస్టై జైలుకు వెళ్లివచ్చినా ఆయనలో మార్పు రాలేదన్నారు. వినుకొండలో భూకబ్జాలు, మట్టి మాఫియా, పేకాట, గంజాయి వంటి అక్రమాలకు బ్రహ్మనాయుడే కారణమని విమర్శించారు.

టిడిపి ప్రభుత్వం అభివృద్ధి పనులు చేపడుతుంటే వైసీపీ అడ్డంకులు సృష్టించిందన్నారు. తాను లేదా తన కుటుంబ సభ్యులు ఒక్క సెంటు భూమి ఆక్రమించినట్లు నిరూపిస్తే శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానని మరోసారి సవాల్ విసిరారు. ముల్పురి ఆగ్రోటెక్ వారి నుండి బ్రహ్మనాయుడు భూమి కొనుగోలు చేసి 175 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించాడని, దీనిపై హైకోర్టులో కేసు నడుస్తుందని, అనుకూలంగా తీర్పు రాగానే ఆ భూమి మొత్తం పేదలకు పంచి పెడతామని చీఫ్ విప్ జీవి ఆంజనేయులు స్పష్టం చేశారు.. నిరాధార ఆరోపణలు మానేసి వినుకొండ అభివృద్ధికి సహకరించాలని జీవీ ఆంజనేయులు సూచించారు.

KAREEMULLA, VINUKONDA

KAREEMULLA, VINUKONDA

Next Story