Vinukonda: వినుకొండలో పల్స్ పోలియో ప్రారంభించిన చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు
Vinukonda: వినుకొండ ప్రభుత్వ ఆసుపత్రిలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రభుత్వ చీఫ్ విప్, ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ప్రారంభించి చిన్నారులకు చుక్కలు వేశారు.
Vinukonda: వినుకొండలో పల్స్ పోలియో ప్రారంభించిన చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు
వినుకొండ: "నిండు జీవితానికి రెండు చుక్కలు" అనే నినాదంతో ఆదివారం నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ విప్, ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు పాల్గొన్నారు. వినుకొండ ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన పోలియో కేంద్రాన్ని సందర్శించిన ఆయన, ఐదేళ్లలోపు చిన్నారులకు స్వయంగా రెండు చుక్కల పోలియో మందు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా జీవీ ఆంజనేయులు మాట్లాడుతూ, పోలియో వ్యాధిని పూర్తిగా నిర్మూలించాలంటే ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని అన్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అప్పుడే పుట్టిన బిడ్డనుండి 5 సంవత్సరాల వయస్సు గల ప్రతి చిన్నారిని సమీప పోలియో కేంద్రానికి తీసుకువెళ్లి పోలియో చుక్కలు వేయించాలని విజ్ఞప్తి చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం, వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు, అంగన్‌వాడీ సిబ్బంది సమన్వయంతో పనిచేస్తున్నారని ఆయన అభినందించారు. ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు అందేలా అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు.




