Vinukonda: చీకటీగలపాలెం సమీపంలో ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన బైక్, వ్యక్తి మృతి

Vinukonda: వినుకొండ మండలం చీకటీగలపాలెం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.

KAREEMULLA, VINUKONDA
Published on: 15 May 2026 2:49 PM IST
Vinukonda
X

Vinukonda: చీకటీగలపాలెం సమీపంలో ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన బైక్, వ్యక్తి మృతి

Vinukonda: వినుకొండ మండలం చీకటీగలపాలెం సమీపంలో గురువారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందగా, మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం వినుకొండ పట్టణానికి చెందిన కంభంపాటి కార్తీక్ (27) తన స్నేహితుడు సుబ్బారావుతో కలిసి స్వంత పనుల నిమిత్తం ద్విచక్ర వాహనంపై అడ్డరోడ్డు వరకు వెళ్లారు. అనంతరం తిరిగి వినుకొండకు వస్తుండగా చీకటీగల పాలెం సమీపంలో రోడ్డుపై ఆగి ఉన్న లారీని వారి బైక్ వేగంగా ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో కార్తీక్‌కు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సుబ్బారావుకు తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు వెంటనే చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలనలు నిర్వహించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వినుకొండ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

KAREEMULLA, VINUKONDA

KAREEMULLA, VINUKONDA

Next Story