Vinukonda: మంత్రిని కలిసిన చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు!

Vinukonda: వినుకొండ నియోజకవర్గంలో రోడ్లు, బ్రిడ్జిల అభివృద్ధికి నిధులు కేటాయించాలని మంత్రి బిసి జనార్దన్ రెడ్డిని కోరిన ప్రభుత్వ చీఫ్ విప్ జివి ఆంజనేయులు.

KAREEMULLA, VINUKONDA
Published on: 7 Aug 2026 7:56 AM IST
Vinukonda
X

Vinukonda: మంత్రిని కలిసిన చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు!

Vinukonda: వినుకొండలో రోడ్లు, బ్రిడ్జిల అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు – చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు

వినుకొండ నియోజకవర్గంలో రోడ్లు, బ్రిడ్జిల అభివృద్ధికి ప్రభుత్వం నిధులు కేటాయించనున్నట్లు ప్రభుత్వ చీఫ్ విప్, సీనియర్ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు తెలిపారు. గురువారం తాడేపల్లిలో రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డిని ఆయన క్యాంపు కార్యాలయంలో కలిసి నియోజకవర్గానికి సంబంధించిన పలు అభివృద్ధి పనులపై వినతిపత్రం సమర్పించారు.వినుకొండ–ఏనుగుపాలెం మీదుగా అద్దంకికి వెళ్లే ప్రధాన రహదారి ప్రస్తుతం సింగిల్ రోడ్డుగా ఉండటంతో ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని జీవీ ఆంజనేయులు వివరించారు.

పెరుగుతున్న ట్రాఫిక్‌ను దృష్టిలో ఉంచుకుని వినుకొండ నుంచి కొప్పెరపాడు వరకు డబుల్ రోడ్డు నిర్మించాలని కోరారు. రహదారి దెబ్బతిన్న కారణంగా తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని, రోడ్డు విస్తరణతో ప్రమాదాలు తగ్గడమే కాకుండా రవాణా సౌకర్యాలు మెరుగుపడి వ్యాపార, ఆర్థిక కార్యకలాపాలకు ఊతమిస్తుందని తెలిపారు.శావల్యాపురం మండలం కారుమంచి వద్ద ఎన్ఎస్పీ కాలువపై వంతెన నిర్మాణం, నియోజకవర్గంలోని ఆర్ అండ్ బి రోడ్లపై అవసరమైన చోట చప్టాల నిర్మాణం, వినుకొండ పట్టణంలో ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని మంత్రిని కోరారు.

ఈ ప్రతిపాదనలపై మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సానుకూలంగా స్పందించి, ఆర్ అండ్ బి శాఖ ద్వారా అవసరమైన నిధులు కేటాయించడంతో పాటు, పీపీపీ విధానంలో కూడా అభివృద్ధి పనులు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు జీవీ ఆంజనేయులు తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధికి సహకరిస్తున్న మంత్రికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

KAREEMULLA, VINUKONDA

KAREEMULLA, VINUKONDA

Next Story