Vinukonda: రూ.25 కోట్ల అభివృద్ధి పనులను ప్రారంభించిన చీఫ్ విప్ జీవీ

Vinukonda: వినుకొండలో రూ.25 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం. రూ.240 కోట్లతో తాగునీటి పథకం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపిన ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు.

KAREEMULLA, VINUKONDA
Published on: 22 Sept 2026 4:14 PM IST
Vinukonda
X

Vinukonda: రూ.25 కోట్ల అభివృద్ధి పనులను ప్రారంభించిన చీఫ్ విప్ జీవీ

వినుకొండ: వినుకొండ పట్టణ అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని ప్రభుత్వ చీఫ్ విప్, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అన్నారు. వినుకొండలో సుమారు రూ.25 కోట్లతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వర్చువల్‌గా ప్రారంభించారు.

ఈ సందర్భంగా జీవీ మాట్లాడుతూ.. వినుకొండ పట్టణంలోని అన్ని వార్డుల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. ప్రజలకు అవసరమైన సీసీ రోడ్లు, డ్రైనేజీలు, ఇతర అభివృద్ధి పనులను ప్రణాళికాబద్ధంగా చేపడుతున్నామని చెప్పారు.

చేపట్టిన పనులను నిర్దేశిత సమయంలో పూర్తి చేయడంతో పాటు నాణ్యతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని అధికారులను ఆదేశించారు.వినుకొండ పట్టణంలో దీర్ఘకాలంగా ఉన్న తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని జీవీ తెలిపారు.

సుమారు రూ.240 కోట్లతో ప్రతిష్టాత్మక తాగునీటి పథకాన్ని అమలు చేస్తున్నామని తెలిపారు . ఈ పథకం ద్వారా పట్టణ ప్రజలకు సురక్షితమైన తాగునీటిని నిరంతరం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. తాగునీటి పథకం పనులను వేగవంతం చేసి, ప్రజలకు త్వరగా ప్రయోజనం కలిగేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

KAREEMULLA, VINUKONDA

KAREEMULLA, VINUKONDA